
భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విదేశీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పాటు థాయ్‌లాండ్(Thailand)లో పర్యటించిన ఆయన.. 3 రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంక(Srilanka)కు వెళ్లారు. శుక్రవారం రాత్రి కొలొంబో(Colombo)కి చేరుకున్న ఆయనకు శ్రీలంక మంత్రులు ఘనస్వాగతం పలికారు. కాగా ఈ పర్యటనలో భారత్, శ్రీలంక మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రక్షణ(Defence), ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం(Health), వాణిజ్య రంగాల(Commercial sectors)కు సంబంధించి ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరగనున్నాయి. కాగా గతేడాది వామపక్ష కూటమికి చెందిన అనుర కుమార దిస్సనాయకే(Anura Kumar Dissanayake) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా శ్రీలంకలో పర్యటిస్తున్నారు.
Landed in Colombo. Grateful to the ministers and dignitaries who welcomed me at the airport. Looking forward to the programmes in Sri Lanka. pic.twitter.com/RYm5q1VhZk
— Narendra Modi (@narendramodi) April 4, 2025
8 అవగాహన ఒప్పందాలపై చర్చ
అంతకుముందు థాయ్‌లాండ్‌లో జరిగిన బిమ్‌స్టెక్ సమావేశం(BIMSTEC Summit) అనంతరం ప్రధాని మోదీ నేరుగా శ్రీలంక చేరుకున్నారు. గత డిసెంబర్‌లో దిస్సనాయకే న్యూఢిల్లీ పర్యటకు వచ్చారు. ప్రధాని మోదీ పర్యనటలో 8 అవగాహన ఒప్పందాలపై సంతకం చేయాలని భావిస్తున్నారు. ఈ పర్యటనకు మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(Ajit Doval), విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఉన్నారు. శనివారం మోదీ కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్‌లో గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత ఆ దేశాధ్యక్షుడు దిస్సనాయకేతో అధికారిక చర్చల్లో పాల్గొంటారు.