
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఆ జట్టు ఆ తర్వాత కేకేఆర్‌పై ఘన విజయం సాధించి గెలుపు బాట పట్టింది. కానీ ఆ ఆశ ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటోమితో MI పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి పడిపోయింది. అటు నాలుగు మ్యాచులు ఆడిన లక్నో 4 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది.
మార్ష్, మార్క్రమ్ బౌండరీల మోత
కాగా లక్నోలోని ఏక్‌నా మైదానంలో జరిగిన ఈ మ్యాచులో తొలుత టాస్ ఓడి టాస్ బ్యాటింగ్ చేసిన LSG 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 60 పరుగులతో చెలరేగగా.. మరో ఓపెనర్ మార్క్రమ్ 38 బంతుల్లో 53 రన్స్ చేశాడు. వీరిద్దరూ బౌండరీలతో ముంబై బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఆయుశ్ బదోని 30, మిల్లర్ 27 రన్స్ చేయడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 203 భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్య 5, బౌల్ట్, అశ్వనీ కుమార్, పుతూర్ తలో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో వారిద్దరు మినహా..
అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై చివరి వరకూ పోరాడి 20 ఓవర్లలో 191/5కే పరిమితమైంది. ఆ జట్టులో నమన్ ధీర్ (46) పరుగులు, సూర్య కుమార్ (67), తిలక్ వర్మ (25), పాండ్య (28) రన్స్ చేశారు. లక్నో బౌలర్లలో శార్దుల్, ఆకాశ్ దీప్, అవేశ్, దిగ్వేశ్ తలో వికెట్ పడగొట్టారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన దిగ్వేశ్‌కు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్” దక్కింది.
LSG 🏏🔥🏆#LSGvMI #MIvsLSG #IPL2025 pic.twitter.com/pohwicAHlb
— ◔‿◔ (@KhusshRaho) April 4, 2025