ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా ఒదిగిపోయే హీరో నాని(Nani). తన సహజ నటనతో గుర్తింపు పొంది నేచురల్ స్టార్(Natural Star)గా ఎదిగాడు నాని. ‘భలే భలే మగాడివోయ్’లో మతిమరుపు, అమాయకపు అబ్బాయిగా అతడి నటన ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఇక తొలిసారి మాస్ క్యారెక్టర్‌లో ‘దసరా’ మూవీలోనూ పాత్రకు తగ్గట్లుగా అద్భుతంగా నటించారు. అయితే ఆయన తాజాగా హిట్ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ‘హిట్(HIT)’ సీక్వెల్ మూవీలు వచ్చినా అభిమానుల్లో ఈ సినిమాల్లో మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.
డైరెక్టర్ శైలేష్ డైరెక్షన్‌లో..
హిట్-1లో విశ్వక్‌సేన్ నటిస్తే, హిట్-2లో అడవి శేష్ నటించాడు. ఈ సినిమాలో చివరలో నాని కనిపిస్తాడు. ఇక హిట్ 3లో మీ ముందుంటానంటూ చెప్పాడు. చెప్పినట్లుగానే డైరెక్టర్ శైలేష్ డైరెక్షన్లో(Sailesh Kolanu) నాని హీరోగా ‘హిట్: ది 3వ కేస్’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీపై మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే రిలీజైన హిట్-3 పోస్టర్ నాని ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది.
Let the streets know that they are going to turn BLOODY RED.
ARJUN SARKAAR is coming 🪓🥵#HIT3Teaser on 24th February ❤️🔥#HIT3 in cinemas worldwide on 1st MAY, 2025.Natural Star @NameisNani @SrinidhiShetty7 @komaleeprasad @MickeyJMeyer @SJVarughese @karthikaSriniva… pic.twitter.com/g6wB0gd2KQ
— Sailesh Kolanu (@KolanuSailesh) February 20, 2025
క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో..
క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని అభిమానుల్లో ఫుల్ హైప్ పెంచేసింది. కాగా ఈమూవీ టీజర్‌ను ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను ట్వీటర్ వేదికగా ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో నాని సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. సినిమాటోగ్రఫీని సానూ జాన్ వర్గీస్ నిర్వహిస్తుండగా, మికీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా ఈ మూవీ మే 1న థియేటర్లలో విడుదల కానుంది.






