CM Revanth: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన

తెలంగాణ ప్రభుత్వం(Telangan Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme)లో ఇవాళ కీలక ముందడుగు పడనుంది. ఈ పథకం అమలులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నారాయణపేట(Narayanapet) జిల్లాలో శంకుస్థాపన చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 11:30కి సీఎం రేవంత్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో కొడంగల్(Kodangal) నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకుని పూజలు చేస్తారు.

ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయనున్న సీఎం

అనంతరం మధ్యాహ్నం 12.25కి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.50కి నారాయణపేట జిల్లా కేంద్రమైన సింగారానికి వెళ్తారు. జిల్లా మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు(Petrol Bunk)ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అప్పక్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన(Foundation stone for construction of Indiramma Houses) చేస్తారు. ఇందులో భాగంగా సీఎం స్వయంగా ముగ్గు పోస్తారు. మధ్యాహ్నం 1.30కి ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే మెడికల్ కాలేజీ(Medical College) నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత విద్యార్థులతో కాసేపు మాట్లాడతారు. మధ్యాహ్నం 2.10కి నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో CM ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. కాగా రేవంత్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

కాగా తొలి దశలో 72,045 ఇళ్లకుగాను MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పనులు ప్రారంభమవుతాయి. లబ్ధిదారులకు బేస్‌మెంట్ లెవెల్‌లో రూ. లక్ష, గోడలు నిర్మించాక రూ. 1.25 లక్షలు, స్లాబ్ తర్వాత రూ. 1.75 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక రూ. లక్ష ప్రభుత్వం అందజేయనుంది.

Related Posts

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *