మీ పాదాలు పగిలిపోయాయా..? ఇలా చేస్తే పగుళ్లు మాయం!

Mana Enadu : చలికాలం (Winter) వచ్చేసింది. ఈ కాలంలో చర్మం పగలడం అనే సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. మరీ ముఖ్యంగా పాదాల పగుళ్ల సమస్య మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇది నడిచేటప్పుడే కాదు.. పడుకునే సమయంలో దుప్పటి ఈ పగుళ్లకు తగిలితే ఇక నరకమే. మరోవైపు చూడ్డానికి కూడా ఈ పగుళ్ల వల్ల కాళ్లు అందంగా కనిపించవు.

పాదాల పగుళ్లు తగ్గేందుకు చక్కటి ఉపాయం

చాలా మంది పాదాల పగుళ్లు (Cracked Heels) పోగొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు క్రీములు, మందులు వాడుతుంటారు. మరికొందరేమో ఏవేవో చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. అయితే పాదాల పగుళ్లు తగ్గేందుకు ఓ చక్కటి ఉపాయం చెబుతున్నారు ప్రముఖ వైద్యురాలు గాయత్రీ దేవి. ఓ ఆయుర్వేద పరిష్కారంతో పగుళ్లు ఇట్టే మాయమైపోతాయని అంటున్నారు. మరి ఈ ఆయుర్వేద ఔషధం ఏంటి..? దాన్నెలా తయారు చేస్తారో చూద్దామా?

ఆయుర్వేద ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు

  • 50 గ్రాముల సుగంధి పాల చూర్ణం
  • 50 గ్రాముల మంజిష్ట చూర్ణం
  • 50 గ్రాముల నువ్వుల నూనె
  • 50 గ్రాముల తెల్ల గుగ్గిలం

ఔషధం తయారీ విధానం

ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ గిన్నె పెట్టాలి. అందులో నీళ్లు పోసి వేడి చేయాలి. నీరు వేడయ్యాక అందులో సుగంధి పాలు (Sugandhi Milk), మంజిష్ట చూర్ణం వేయాలి. అది వేసిన తర్వాత కాసేపు కలిపి, నీటిని సన్నని మంటపై మరగనివ్వాలి. ఆ తర్వాత జల్లిగంటెతో నీటిని వడకట్టాలి. మరో గిన్నెను వేడి చేసి అందులో వడపోసిన కషాయాన్ని పోయాలి. అందులో నువ్వుల నూనె (Musturd Oil) వేయాలి. ఆ తర్వాత సన్నని మంటపై మరిగించి.. నీరంతా ఆవిరైన తర్వాత మిగిలిన నూనెలో తెల్ల గుగ్గిలం పొడిని కలిపి.. 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుంటే ఔషధం రెడీ అయినట్టే.

ఔషధం ఎలా వాడాలి అంటే..?

ఈ ఆయుర్వేద ఔషధాన్ని రాత్రి పూట పాదాలకు పగుళ్లు ఉన్న చోట పెద్ద పరిమాణంలో రాయాలి. రాత్రి మొత్తం అలాగే ఉంచుకోవాలి. మరుసటి రోజు ఉదయం వేడి నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఆ నీళ్లలో పాదాలను కాసేపు ఉంచి క్లీన్ చేసుకోవాలి. రోజుకు ఒకసారి ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లను సులభంగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్ గాయత్రీ దేవి. ఈ ఔషధంలో ఉండే సుగంధి పాలు మృత కణాలు తొలిగి కొత్త కణాలు రావడానికి సాయం చేస్తుందని చెప్పారు. ఇక మంజిష్ట చూర్ణం.. చర్మానికి మంచి టానిక్​లాగా పని చేస్తుందని వివరించారు.

గమనిక : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *