హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతం అనగానే అందరికీ గుర్తొచ్చేది హోటల్ తాజ్ బంజారా (Hotel Taj Banjara). ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ హోటల్ తాజాగా మూతపడింది. రెండేళ్లుగా ఆస్తి పన్ను కట్టకపోవడంతో ఈ హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రూ.కోటి 43 లక్షల ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే పన్ను చెల్లించాలని అనేకసార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ యాజమాన్యం పట్టించుకోలేదని చెప్పారు. రెడ్ నోటీస్ ఇచ్చినా స్పందించకపోవడంతో హోటల్ సీజ్ చేశామని జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు స్పష్టం చేశారు.






