WAR 2 హీరోకు గాయం.. విడుదల వాయిదా పడినట్లేనా?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా వార్-2 (WAR 2). ఈ చిత్రంతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అయాన్ ముఖర్జీ (ayan mukherjee) దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ కోసం ఇటు హిందీ ఆడియెన్స్, అటు తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

వార్-2లో ఎన్టీఆర్-హృతిక్ సాంగ్

ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan) మధ్య వచ్చిన నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ పాట ఎంత ఫేమస్ అయిందో.. ఇందులో ఈ ఇద్దరు హీరోల డ్యాన్స్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వార్-2 సినిమాలో కూడా ఇలాంటి ఓ పాటను ప్లాన్ చేస్తున్నాడ డైరెక్టర్ అయాన్. హృతిక్ డ్యాన్స్ కు పేరు పెట్టనక్కర్లేదు. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ ను మ్యాచ్ చేసే స్టామినా ఉన్న హీరోలు ఇప్పటి వరకు కనిపించలేదు.

హృతిక్ కు గాయం

ఇక ఈ ఇద్దరు కలిసి స్టెప్పేస్టే థియేటర్లో విజిల్సే విజిల్స్. వార్-2 సినిమా సినిమాలో ఎన్టీఆర్-హృతిక్ (NTR Krithik Song) ల మధ్య ఓ హుషారైన పాటను అయాన్ ప్లాన్ చేశాడట. అందుకోసం ఈ ఇద్దరు హీరోలు రిహార్సల్స్ కూడా షురూ చేశారట. అయితే ఈ రిహార్సల్స్ సమయంలో హృతిక్ కు గాయాలైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారట. నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. దీంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

500 మంది డ్యాన్సర్లు 

బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ బ్యానర్ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ‘వార్‌ 2’ను నిర్మిస్తోంది. ముంబయిలోని యశ్‌రాజ్‌ స్టూడియోస్‌లో రూపొందించిన భారీ సెట్‌లో ఓ పాట షూటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. ఇక ఎన్టీఆర్-హృతిక్ పాటలో దాదాపు 500 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని టాక్. బాస్కో మార్టిస్‌ దీనికి కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *