Flipkart Big Billion Days Sale : స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు 

Mana Enadu: ఇ- కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి షురూ కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఒక రోజు ముందుగానే సెప్టెంబర్‌ 26నే సేల్‌ అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. తాజాగా కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ను ఫ్లిప్కార్టు ప్రకటించింది. గూగుల్‌ పిక్సెల్‌8, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

బిగ్‌ బిలియన్‌ డేస్‌లో భాగంగా ఫ్లిప్కార్ట్ గూగుల్‌ పిక్సెల్‌ 8 (Google Pixel 8) ఫోన్‌పై డిస్కౌంట్‌ అందిస్తోంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ఎమ్మార్పీ ధర రూ.75,999 ఉండగా.. సేల్‌లో రూ.40,000 కంటే తక్కువ ధరకే విక్రయించనున్నారు. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 (Samsung Galaxy S23) 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.40వేల కంటే తక్కువకు.. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ (Samsung Galaxy S23 FE)బేస్‌ వేరియంట్‌ మొబైల్‌ రూ.30వేల లోపు.. పోకో ఎక్స్‌6 ప్రో 5జీ ( Poco X6 Pro 5G) రూ.20వేల లోపు లభించనున్నాయి. మరోవైపు సీఎంఎఫ్‌ ఫోన్‌1, నథింగ్‌ ఫోన్‌2ఏ, పోకో ఎం6 ప్లస్‌, వివో టీ3ఎక్స్‌, ఇన్ఫినిక్స్‌ నోట్‌40 ప్రో.. మొబైల్స్‌ను ఈ సేల్‌లో తక్కువ ధరలకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

ఆ కార్డులపై భారీ డిస్కౌంట్స్

మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుదారులకు భారీ డిస్కౌంట్‌ ఉండనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌ ద్వారా చేసే ప్రతి కొనుగోలుపై 10శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ .. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ చెల్లింపులతో రూ.50 తగ్గింపు అందిస్తోంది. ఇక ప్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ద్వారా లక్ష వరకు రుణ సదుపాయంతోపాటు ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపైనా నో- కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం పొందొచ్చని ఈ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *