Dimples : సొట్టబుగ్గలున్న అమ్మాయిలు చాలా స్పెషల్ గురూ!

Mana Enadu: ‘ఏం సక్కగున్నావ్రో.. ఓ సొట్ట బుగ్గలోడా’, ‘సొట్టబుగ్గలా చిన్నదానా.. నిన్ను చూసి నిల్వదాయె నా మనసు జానా’, ‘సొట్టబుగ్గల ఓ సిన్నది.. నేను కన్నుకొడితే సిగ్గుపడ్తది’.. ఇలా సొట్టబుగ్గలపైన ఎన్నో పాటలున్నాయి. నిజానికి సొట్టబుగ్గలు(Dimples) చాలా మందికి అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఎంత మందిలో ఉన్నా సొట్టబుగ్గలున్న వారు చాలా స్పెషల్గా కనిపిస్తారు. అందులోనూ అమ్మాయిలకు సొట్టబుగ్గలుంటే ఇక ఆ అందం ద్విగుణీకృతం అవుతుంది. ఇక ఆ సొట్టబుగ్గలో నవ్వు మరింత వన్నెగా ఉంటుంది.

సొట్టబుగ్గలున్న వారు లక్కీఫెల్లోస్..

అయితే చాలా మంది సొట్టబుగ్గలున్న వారు అదృష్ట వంతులు అంటుంటారు. ఇక వారిని పెళ్లి చేసుకున్న వారికి మరింత అదృష్టమ(Lucky)ని చెబుతుంటారు. నిజానికి బుగ్గ మీద సొట్ట అన్నది చిన్న లోపం. కాకపోతే అదో అందమైన లోపం అన్నమాట. బుగ్గమీది చర్మం, దాని కింద నుండే కండ రెండు సమానంగా లేనప్పుడు ఈ సొట్ట ఏర్పడుందట. అందుకే నవ్వినప్పుడు వీరిలో కండకన్నా ఎక్కువ ఉన్న చర్మం సొట్ట ఏర్పడుతుందట. అయితే ఈ అందమైన లోపం చాలామందికి అదృష్టమని అంటుంటారు. నిజంగా అది అదృష్టమేనా?

డింపుల్ బ్యూటీస్

సొట్టబుగ్గలున్న వారు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారట. వీళ్లతో వైవాహిక జీవితం(Married Life) అద్భుతంగా ఉంటుందట. డింపుల్స్ ఉన్న అమ్మాయిలు మంచి భార్యగా, ఉత్తమ కోడలిగా నడుచుకుంటారట. అత్తమామల పట్ల చాలా ప్రేమగా ఉంటారట. ఎప్పుడూ వినయపూర్వకంగా తమ ప్రవర్తన కలిగి ఉంటారు. ఇక జ్యోతిష్యం ప్రకారం సొట్టబుగ్గలు ఉన్నవారి లవ్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. వీరు తమ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

డింపుల్ భామలు చాలా ఎనర్జిటిక్ 

సొట్టబుగ్గలు కలిగి ఉన్న స్త్రీలు ఎప్పుడూ ఎనర్జిటిక్గా ఉండటంతో పాటు ప్రతి విషయంలోనూ చాలా ఓపెన్ గా ఉంటారట. తమ జీవితాన్ని ఏమాత్రం సంకోచించం లేకుండా.. ఇతర విషయాల గురించి బాధ పడుకుండా జాలీగా లైఫ్(Life) లీడ్ చేస్తారట. వీరి ముఖంలో దుఖం చాలా అరుదుగా కనిపిస్తుంది. సొట్టబుగ్గలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందు వారితో స్నేహం ఉండటం ముఖ్యం అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.

Share post:

లేటెస్ట్