దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహేశ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్(Shooting) పూర్తి చేసుకున్న ఈ మూవీ తదుపరి షూట్‌పైన ఫోకస్ చేసింది. తాజాగా దీనికి సంబంధించి ఓ న్యూస్ టీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కోసం ఓ భారీ సెట్‌ను రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

జూన్ 10 నుంచి తదుపరి షూటింగ్
టాలీవుడ్ సినిమాల్లో వారణాసి(Varanasi) నగరానికి ప్రత్యేకత ఉంది. చాలా సినిమాలు వారణాసి నేపథ్యంలో రూపొందాయి. తాజాగా వచ్చిన ప్రభాస్(Prabhas) కల్కి(Kalki Movie) చిత్రంలో కూడా వారణాసి ఉంటుంది. ఇప్పుడు మహేశ్ బాబు సినిమా కోసం కూడా వారణాసి నగరాన్ని సృష్టిస్తున్నారని సమాచారం. ఇప్పటికే కొంత షూట్ పూర్తి చేసిన మేకర్స్ జూన్ 10 నుంచి తదుపరి చిత్రీకరణ షురూ చేయనున్నారట. ఈమేరకు వారణాసి సెట్(Varanasi Set) కోసం ఆర్ట్ డిపార్టుమెంట్ శ్రమిస్తోందట. ఇందులోనే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని సమాచారం.
#SSMB29 🔥#MaheshBabu as smart archaeologist in #SSMB29 🔥 !@ssrajamouli pic.twitter.com/vulFNwKdLf
— Râvī (@Ravi24112003) May 3, 2025
దాదాపు రూ.వెయ్యి కోట్ల బడ్జెడ్‌తో..
ప్రస్తుతం ఈ సెట్‌కి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్(Release) చేసే అవకాశం ఉంది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ.1000కోట్ల వ్యయంతో డా. KL నారాయణ నిర్మిస్తున్నారు. కీరవాణి(Kiravani) సంగీతం అందిస్తున్నారు.







