హుస్సేన్‌సాగర్‌(Hussainsagar) తీరంలో పుట్టినరోజు వేడుకలను నిషేధిస్తూ ప్రభుత్వ విభాగాలు నిర్ణయం తీసుకున్నాయి.
హుస్సేన్‌సాగర్‌(Hussainsagar) తీరంలో పుట్టినరోజు వేడుకలను నిషేధిస్తూ ప్రభుత్వ విభాగాలు నిర్ణయం తీసుకున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా పూర్తిస్థాయిలో ఆధునికీకరణ పనులు చేపట్టిన ట్యాంక్‌బండ్‌పై రాత్రి వేళల్లో యువతీ, యువకులు పుట్టిన రోజు, ఇతర సందర్భాలను పురస్కరించుకొని కేక్‌లు కట్‌ చేస్తున్నారు. కొందరు సన్మానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు ట్యాంక్‌బండ్‌పై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కేక్‌ కట్‌ చేయడం, చెత్త వేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని, ఇందుకు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై సీసీటీవీ కెమెరాలున్న దృష్ట్యా… నిబంధనలు పాటించని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.