
టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ ముద్దుబిడ్డ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)పై తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) ప్రశంసల జల్లు కురిపించింది. ఇంగ్లండ్(England) తో టెస్టు సిరీస్ ను భారత్ సమం చేయడడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సిరాజ్ అద్భుత ప్రదర్శనను అభినందిస్తూ పోలీస్ శాఖ ప్రత్యేకంగా స్పందించింది. సిరాజ్ కేవలం క్రీడాకారుడే కాకుండా, పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) హోదాలో ఉన్న అధికారి కావడం విశేషం.
2024లో డీఎస్పీ హోదాతో సన్మానం
హైదరాబాద్(Hyderabad)కు చెందిన సిరాజ్ 2024 టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt), సిరాజ్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) హోదాతో సన్మానించింది. అక్టోబర్ 11, 2024న తెలంగాణ డీజీపీ జితేందర్(Telangana DGP Jitender) సమక్షంలో సిరాజ్ ఈ పదవిని స్వీకరించారు. అంతేకాకుండా, జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల భూమిని కూడా సిరాజ్‌కు కేటాయించారు. సిరాజ్ క్రికెట్‌లో చూపిన అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. 2017లో న్యూజిలాండ్‌పై టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సిరాజ్, 89 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 163 వికెట్లు తీసి భారత బౌలింగ్ దళంలో కీలక సభ్యుడిగా నిలిచారు.
అతడు “తెలంగాణ గర్వం”
2023 ఆసియా కప్ ఫైనల్(Asia Cup Final)లో 6/21 వికెట్లతో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ క్రమంలో అతడు ప్రపంచ నంబర్ వన్ వన్డే బౌలర్‌గా కూడా గుర్తింపు పొందారు. హైదరాబాద్ పోలీస్ శాఖ సిరాజ్‌ను “తెలంగాణ గర్వం”గా కొనియాడింది. అతడి కఠిన శ్రమ, అంకితభావం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొంది. సిరాజ్ క్రికెట్‌తో పాటు పోలీస్ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రానికి, దేశానికి మరింత గౌరవం తెస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. సిరాజ్ ఈ గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేయడానికి తన వంతు కృషి చేస్తానని ట్వీట్ చేశారు.
Congratulations to Shri Mohammed Siraj, DSP!
For his stellar performance in India’s historic Test win against England!
Pride of Telangana | Hero in Uniform & Sport pic.twitter.com/K9pH247kgT
— Telangana Police (@TelanganaCOPs) August 4, 2025