భాగ్యనగరంలో గత మూడు వారాలుగా సందడి చేస్తున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు(Miss World contestants).. నేడు తుది సమరానికి రెడీ అయ్యారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్(Hitex Exhibition Center)లో 72వ మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే(The grand finale) ఈరోజు జరగనుంది. విశ్వసుందరి కిరీటం(Miss Universe crown) కోసం తుది పోటీల్లో నాలుగు ఖండాలకు చెందిన 40 మంది అందగత్తెలు పోటీపడుతున్నారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ అదిరిపోయేలా ఏర్పాట్లు చేసింది. “Beauty with a Purpose” అనే నినాదంతో జరుగుతున్న ఈ పోటీలు మే 10న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో 108 దేశాల నుంచి వచ్చిన అందాల సుందరాంగులు పాల్గొంటున్నారు.

150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్
ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే(Miss World Grand Finale-2025) 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ కానుంది, దీనికి 3,500 మంది అతిథులు హాజరవుతారు. చీఫ్ గెస్టుగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈసారి మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ(Prize Money) లభిస్తుంది. ఈ పోటీలో ఇండియా తరపున నందినీ గుప్తా(Nandini Gupta) పాల్గొంటోంది. ఆమె ఫెమినా మిస్ ఇండియా(Femina Miss India 2023) టైటిల్ విజేతగా సెమీ-ఫైనల్స్‌కు చేరింది. నందిని తన ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ స్కిల్స్(Communication skills)తో న్యాయనిర్ణేతల్ని ఆకట్టుకుంది. ఆమె “Project Ekta” ద్వారా సామాజిక సమస్యలపై అవగాహన పెంచడంతో పాటు, టాప్ మోడల్ ఛాలెంజ్‌లో కూడా తన సత్తా చాటింది.
And the wait is almost over
The day whole world is waiting for is here
Miss world grand finale – 2025
Tomorrow 6:30 PM onwards at HITEX #MissWorld2025 #TelanganaZaruraana pic.twitter.com/T1IxBdag8r
— Tharun Reddy (@Tarunkethireddy) May 30, 2025






