తెలుగు ప్రేక్షకుల మనసుల్లో బ్రహ్మముడి సీరియల్‌లో “కావ్య”( Brahmamudi Fame Kavya) పాత్రతో తనదైన ముద్ర వేసిన దీపిక రంగరాజు(Deepika Rangaraju), తక్కువ సమయంలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అహంకారంతో ఉన్న భర్తను సహనంతో మార్చే స్త్రీ పాత్రను పోషించిన ఆమె, తెలుగులో ఎక్కువగా కనిపించకపోయినా తన పాత్ర కావ్య ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది.
దీపిక రంగరాజు సోషల్ మీడియాలో పలు షోల అప్‌డేట్స్, వెకేషన్ పిక్స్, ఫోటోషూట్లు పంచుకుంటూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. బ్రాండ్ అంబాసడర్‌గానూ పలు యాడ్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇటీవల నాచురల్ స్టార్ నానితో కలిసి నటించిన ఓ యాడ్ హిట్ టాపిక్ గా మారింది.
అల్లరి, హాస్యం, జోష్‌తో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే దీపిక.. ఇటీవల జబర్దస్త్ ఫేమ్ వర్ష(Jabardasth fame Varsha) నిర్వహించిన “కిస్సిక్ టాక్స్”(Kissik Talks) పాడ్‌కాస్ట్‌కి హాజరై దీపికా తన కెరీర్, జీవితానికి సంబందించిన విషయాను పంచుకుంది. “చిన్నప్పటినుంచి సొంత ఇల్లు కొనాలనేది నా కల. కానీ ఇప్పటికీ అది నెరవేరలేదు. ఇప్పుడు ఉన్నది కేవలం నేను చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే 6 అడుగుల స్థలం మాత్రమే” అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇలా అనడంలో ఆమె వ్యక్తిగత జీవితం వెనకున్న బాధ ఈ ఎపిసోడ్ లో స్పష్టంగా కనిపించింది.
తాజాగా టెలివిజన్, సినిమా పరిశ్రమల్లో క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) గురించి మాట్లాడిన దీపిక – తనకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలిపింది. “మనమేమీ తప్పు చేయకపోయినా, కొన్ని నిందలు మనపై పడతాయి. టెలివిజన్ ఫీల్డ్ ప్యూర్‌గా ఉంటే, కొన్ని తప్పుల వల్ల సినిమా ఫీల్డ్ పైనా నిందలు వస్తాయి. కానీ నిజంగా కృషితో ఎదిగినవాళ్లు అలా వ్యవహరించరు. నేను ఇలాంటివి ఎదురైనా నిశ్శబ్దంగా దూరమయ్యాను, గొడవపడలేదు,” అని స్పష్టంగా చెప్పారు.
View this post on Instagram
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతున్నాయి. బ్రహ్మముడిలో చేసిన నటనతో మాత్రమే కాకుండా, తన నిజాయితీతోనూ దీపిక రంగరాజు మరోసారి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.






