టీమ్ఇండియా(Team India) దుమ్మురేపింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో మరో ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)ని ఖాతాలో వేసుకుంది. టోర్నీలో ఒక్క మ్యాచులోనూ ఓడకుండా అజేయంగా కప్‌ను పట్టేసింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy -2025)ని గెలుచుకుంది.
టాస్.. వరుసగా 15వ సారి
ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ మ్యాచులోనూ భారత్ టాస్ ఓడిపోయింది. దీంతో వరుసగా 15వ మ్యాచుల్లోనూ టీమ్ఇండియా టాస్ ఓడిపోయి రికార్డు పుటల్లో నిలిచింది. దీంతో తొలుత ఫీల్డింగ్ చేసిన రోహిత్(Rohit) సేన తొలి 10 ఓవర్ల వరకు మ్యాచుపై పట్టు సాధించలేకపోయింది. కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర(37) యంగ్ (15)తో కలిసి ఆ జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దీంతో 7.4 ఓవర్లలోనే కివీస్ 57/0గా నిలిచింది. ఇక స్పిన్నర్లను బరిలోకి దింపిన రోహిత్.. కుల్దీప్, వరుణ్, అక్షర్, జడేజా కివీస్ బ్యాటర్లను ఓ ఆడేసుకున్నారు. దీంతో మిచెల్(63), గిలిప్స్ (34), బ్రాస్ వెల్(53) మాత్రమే రన్స్ చేశారు. మిగతావారు విఫలమవడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 251/7 రన్స్ చేసింది. కుల్దీప్, వరుణ్ చెరో రెండు వికెట్లు తీశారు.
రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్..
అనంతరం ఛేదనలో రోహిత్-గిల్ భారత్‌కు టోర్నీలో తొలిసారి సెంచరీ పార్ట్నర్ షిఫ్ అందించారు. ముఖ్యంగా రోహిత్(76) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. గిల్(31), అయ్యర్ (48), అక్షర్ (29), రాహుల్(34), పాండ్య(18), జడేజా (9) రన్స్ చేసి 49 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(Man of the Match) అవార్డు దక్కగా.. టోర్నీలో రాణించిన కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్రకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్(Man of the Series) అవార్డు దక్కింది.
#INDvsNZ #ViratKohli𓃵 #ViratKohli𓃵 #RohitSharma𓃵 #indvsnzfinal pic.twitter.com/5wp3uyt6pj
— jamal (@abidjamal63) March 9, 2025






