Mana Enadu : నందమూరి బాలకృష్ణ (Allu Arjun) హోస్టుగా ఆహా వేదికగా సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable With NBK) స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీజన్-4కు సంబంధించి మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. మొదటి ఎపిసోడ్ లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందడి చేశారు. ఇక సెకండ్ ఎపిసోడ్ లో ‘లక్కీ భాస్కర్ (Lucky Baskhar)’ మూవీ టీమ్ రాగా.. మూడో ఎపిసోడ్ లో ‘కంగువా (Kanguva)’ ప్రమోషన్స్ కోసం తమిళ నటుడు సూర్య వచ్చారు.
ఆ విషయం చాలా బాధించింది
ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేసింది ఆహా టీమ్. ఈ ఎపిసోడ్ లో ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) ప్రమోషన్స్‌లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సందడి చేశాడు. సినిమా విశేషాలతోపాటు జాతీయ అవార్డు గురించి మాట్లాడుతూ.. తెలుగులో ఒక్కరికి కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాకపోవడం తనని బాధించిందని తెలిపారు. ఎలాగైనా సాధించాలనుకున్నానని చెప్పారు.
ఆ విషయంలో బాగా కోపం వస్తుంది
మరోవైపు చిరంజీవి, మహేశ్‌బాబు(Mahesh Babu)తోపాటు తోటి నటీనటులతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ఇక ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడారు. అమ్మాయిల విషయంలో అన్యాయం జరిగితే తనకు బాగా కోపం వస్తుందని అన్నారు. నవంబర్ 15వ తేదీన ఈ ఎపిసోడ్ పార్ట్ 1 ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
డిసెంబరు 5న విడుదల
ఇక పుష్ప సినిమా సంగతికి వస్తే.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సూపర్ సకెస్స్ కాగా ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప ది రూల్’ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న (Rashmika Mandanna), ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా పార్ట్-2లోనూ స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఈ సాంగ్ లో శ్రీలీల కనిపించనుందట. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.