Mana Enadu : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీబిజిగా ఉన్నాడు. ఓవైపు ‘రాజా సాబ్ (Raja Saab)’ షూటింగ్లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆయన మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు. అందులో ‘యానిమల్’ ఫేం సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో చేయాల్సిన స్పిరిట్ చిత్రం కూడా ఉంది. అయితే ఈ మూవీలో విదేశీ నటులు నటిస్తున్నారంటూ గతంలో సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. ముఖ్యంగా కొరియన్ నటుడు డాన్ లీ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి.
స్పిరిట్ లో కొరియన్ విలన్
డాన్ లీ ‘స్పిరిట్ (Spirit Movie)’లో విలన్‌గా నటిస్తున్నారంటూ గతంలో నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. కానీ అటు డాన్ లీ (Don Lee) కానీ ఇటు మూవీ టీమ్ కానీ స్పందించలేదు. ఇక అది రూమరేనంటూ అందరూ ఆ విషయం లైట్ తీసుకున్నారు. అయితే తాజాగా ఈ రూమర్ మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. డాన్ లీ స్పిరిట్ విలన్ అంటూ మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తో లీ ఫైట్ కచ్చితంగా ఉంటుందంటూ నెట్టింట రెబల్ స్టార్ అభిమానులు తెగ రచ్చ చేస్తున్నారు. ఇంతకీ ఈ విషయం మళ్లీ ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే?
ఆ పోస్టర్ తో మళ్లీ ట్రెండింగ్ లోకి లీ
‘సలార్ 2 (Salaar 2)’ త్వరలోనే పట్టాలెక్కనున్నందున ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు డాన్ లీ. ఆల్ ది బెస్ట్ అంటూ ఓ ఎమోజీ కూడా యాడ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. ఇప్పటివరకూ ఎటువంటి రూమర్‌కు స్పందించని లీ.. ఇప్పుడు సలార్ కు విషెస్ చెప్పడం చర్చనీయాంశమైంది.
#Spirit✴️
Donlee – #Prabhas pic.twitter.com/PgA7iv8RdP
— Manobala Vijayabalan (@ManobalaV) November 9, 2024
ఈ క్రమంలోనే ఆయన ప్రభాస్ తో కలిసి నటిస్తున్నారనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే ఆయన సలార్ మూవీలో నటిస్తున్నాడా? లేక స్పిరిట్ లో నటిస్తుండటం వల్ల ప్రభాస్ ను సపోర్ట్ చేసేందుకు ఇలా పోస్టు పెట్టారా అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు.