ఇండియా, పాకిస్థాన్ మధ్య పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వైపులా మిస్సైళ్ల దాడులతో రణరంగాన్ని తలపించింది. పహల్గాం దాడి అనంతరం సింధు నది (Indus River) జలాలను భారత్ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కడ లష్కరే తయ్యిబా ఉగ్రవాద సంస్థ లీడర్ హఫీజ్ సయీద్ మాట్లాడుతూ.. సింధు నదిలో నీళ్లను ఆపితే అందులో నీటికి బదులు మీ రక్తం పారుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
పాక్ నేతల నోళ్లు మూత బడటం లేదు..
దీంతో ఆపరేషన్ సింధూర్ లో (Operation Sindhur) ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. ఆ తర్వాత పాకిస్థాన్ లోని 11 ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది. దీంతో అక్కడ న్యూక్లియర్ కు సంబంధించిన రేడియేషన్ విడుదలైనట్లు పుకార్లు వచ్చాయి. అయినా పాక్ ఆర్మీ, అక్కడి నేతల నోళ్లు మూతబడటం లేదు.
మీరు టెర్రరిస్టులా.. ఆర్మీ ఆఫీసర్లా?
భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతల (India Pakistan Tensions) నేపథ్యంలో మరో సారి అక్కడి ఆర్మీ స్పోక్స్ పర్సన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి (Pakistan Military Spokesperson) మాట్లాడుతూ.. భారత్ సింధు (Indus River)నది నీటిని ఆపితే అందులో వారి రక్తం ప్రవహిస్తుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. చైనా, పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ ను ఆపాలని భారత్ చూస్తోంది. కశ్మీర్ లో డ్యాం నిర్మించి పాక్ నీళ్లు రాకుండా చూడాలని అనుకుంటున్నారు. ఇదే జరిగితే సింధు నదిలో నీటికి బదులు ఇండియన్స్ రక్తం పారుతుందంటూ, ఊపిరి ఆపేస్తాం అంటూ పాక్ ఆర్మీ సైనిక ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రపంచ దేశాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పాక్ ఆర్మీ కూడా టెర్రరిస్టుల మాదిరిగానే మాట్లాడుతోందని ఇది సరైనది కాదని చెబుతున్నారు.






