
Mana Enadu : నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. ప్రస్తుతం తమిళనాడు (Tamilnadu) తీరం వైపు పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కదులుతోందని వెల్లడించింది. దీని ప్రభావంతో AP, తమిళనాడు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో
అల్పపీడన ప్రభావంతో APలో ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇవాళ (TUESDAY) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకట్రోండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు(బుధవారం) రోజు నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఒకట్రోండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్(Orange Alert) జారీ చేసింది. అలాగే బుధవారం నాడు కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్(Yellow Alert)జారీ చేసింది.
తెలంగాణలో పెరిగిన చలి
దక్షిణ కోస్తా ప్రాంతంలో మత్స్యకారులు(Fishermen) వేట కోసం సముద్రం లోపలికి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45KM వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD తెలిపింది. మధ్య భారతం మీదుగా వస్తున్న చలి గాలుల ప్రభావంతో ఛత్తీస్‌గఢ్ దానికి ఆనుకుని ఉన్న ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాలు.. తెలంగాణ(Telangana)కు ఆనుకుని ఉన్న కోస్తా ప్రాంతాల్లో చలి మరింత పెరిగింది. చలికాలం, అల్పపీడనం ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి