Tollywood: 2024లో పెళ్లిపీటలెక్కిన సెలబ్రిటీలు వీరే!

Mana Enadu : 2024లో పెళ్లిళ్లు(Marriages) కూడా బాగానే జరిగాయి. అలాగే టాలీవుడ్(Tollywood) నుంచి బాలీవుడ్(Bollywood) దాకా అన్ని సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్ సెలబ్రిటీలు(Star Celebrities) పెళ్లిళ్లు చేసుకొని ఓ ఇంటివారయ్యారు. టాలీవుడ్‌లో కూడా బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నారు. మరి 2024లో పెళ్లిపీటలెక్కిన పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు(Tollywood Celebrities) ఎవరో తెలుసుకుందామా..

అక్కినేని కోడలిగా శోభిత

టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగి బాలీవుడ్‌కి చెక్కేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం నడిపి ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. రకుల్ లాగే టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసి బాలీవుడ్ చెక్కేసిన హీరోయిన్ తాప్సి కూడా మార్చ్‌లో డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌‌ని వివాహం చేసుకుంది. తాజాగా హీరో నాగచైతన్య-హీరోయిన్ శోభిత ధూళిపాళ(Naga Chaitanya-Sobhita Dhulipala) గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవల డిసెంబర్ 4న ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar) ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాల‌రీ నిర్వాహ‌కుడు నికోలాయ్ సచ్‌దేవ్‌(Nikolai Sachdev)ను పెళ్లాడారు.

ప్రేమతో దగ్గరై పెళ్లితో ఒక్కటై..

వీరితోపాటు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Director Krish Jaggerlamudi) నవంబర్ లో డాక్టర్ ప్రీతీ చల్లాను వివాహం చేసుకున్నారు. హీరో సిద్దార్థ్-హీరోయిన్ అదితిరావు హైదరి(Siddharth-Aditi Rao Hydari) సెప్టెంబర్‌లో ఇక్కడే వరంగల్ దగ్గర్లోని ఓ ఆలయంలో సింపుల్‌గా వివాహం చేసుకున్నారు. అలాగే యువ హీరో కిరణ్ అబ్బవరం-హీరోయిన్ రహస్య గోరఖ్(Kiran Abbavaram-Secret Gorakh) గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఆగస్టులో వివాహం చేసుకున్నారు. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు(Subbaraju) 47 ఏళ్ల వయసులో నవంబర్‌లో స్రవంతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఇటీవలే డిసెంబర్ 12న తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరితో పాటు పలువురు సెలబ్రిటీలు 2024లో పెళ్లిపీటలెక్కారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *