Rain Alet: రానున్న మూడు రోజులు వర్షాలు!

తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) ప్రకటించింది. ఈ మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు(Maximum temperatures) సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇవాళ (May 10) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30KM నుంచి 40KM వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రానున్న రెండు రోజులు కూడా గంటకు 40KM నుంచి 50KM వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ నెల 27నే రుతుపవనాల ఎంట్రీ

ఈసారి దేశంలోకి నైరుతి రుతుపవనాలు (South West Monsoon) అంచనాల కంటే ముందే ప్రవేశించనున్నాయి. సాధారణంగా జూన్‌ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడం ద్వారా దేశమంతటా వర్షాలు(Rains in India) మొదలవుతాయి. జులై 8 నాటికి ఇవి దేశమంతా విస్తరిస్తాయి. మళ్లీ వాయవ్య భారతం నుంచి సెప్టెంబరు 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలై అక్టోబరు 15 నాటికి ముగుస్తుంది. ప్రస్తుతం ఇవి జూన్ 1 కంటే ముందుగా మే 27న కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం ప్రకటించింది. గతేడాది మే 30న రాగా.. 2023 జూన్ 8న, 2022 మే 29న దేశంలోకి ప్రవేశించాయి.

Related Posts

Rain News: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు(గురువారం) భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. గత మూడు రోజుల నుంచి తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు…

Heavy Rain: మహానగరాన్ని మళ్లీ ముంచెత్తిన వాన.. కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తం

హైదరాబాద్ మహానగరాన్ని శనివారం రాత్రి (ఆగస్టు 9) కూడా భారీ వర్షం(Heavy Rain) ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కారణంగా నగరం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(Hyderabad-Vijayawada National Highway)పై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *