Mana Enadu: లైగింక వేధింపుల ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ (Choreographer) జానీ మాస్టర్(Jony Master)పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) స్పందించింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు(rape case) నమోదైన నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు అందినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అంశాన్ని వేధింపుల పరిష్కార ప్యానెల్‌కు సిఫార్సు చేసినట్లు పేర్కొంది. బాధిత పార్టీల ప్రైవసీ(Privacy)ని రక్షించాలని మీడియా(Media)ను అభ్యర్థించింది. దీనిపై POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందని పేర్కొంది.
‘‘బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో FIR నమోదు చేశారని తెలిసింది. ఈ క్రమంలో బాధితుల గోప్యతను కాపాడాలని మేము అన్ని మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నాము. సుప్రీంకోర్టు(Suprem court) మార్గదర్శకాల ప్రకారం ఈ సమస్య పరిష్కరించబడే వరకు సంబంధిత వ్యక్తుల ముసుగులు లేని ఫొటోలు(Photos), వీడియో(Vidoes)లను ఉపయోగించవద్దు. ఎవరైనా అలా వాడితే వెంటనే తీసివేయమని అందరినీ కోరుతున్నాము’’ అని తెలిపారు.
ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్
కాగా ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనని లైంగికంగా వేధించాడని, మతం మారి పెళ్లి చేసుకోమని బలవంతపెట్టాడని, వర్క్ పరంగా కూడా ఇబ్బంది పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. మరోవైపు జానీ మాస్టర్‌ను జనసేన(Janasena) కూడా దూరం పెట్టింది. అత్యాచారం కేసులో నిజానిజాలు బయటపడే వరకు ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు వీరాభిమాని. ఆయన కోసమే జానీ జనసేనలో చేరారు. ఏపీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.