Cherlapally Terminal: ఈనెల 6న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం

ఎయిర్ పోర్టును తలపించేలా భాగ్యనగరంలో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ (Cherlapally Railway Station) తెలంగాణకే తలమానికంగా మారింది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. ప్రజెంట్ హైదరాబాద్ మహానగరంలో ఉన్న నాంపల్లి(Nampally), సికింద్రాబాద్(Secunderabad), కాచిగూడ స్టేషన్ల(Kachiguda stations)లో రద్దీ భారం తగ్గనుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌(Charlapally Railway Terminal)ను గత నెల 28వ తేదీనే ప్రారంభించాల్సి ఉంది. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో వాయిదా పడింది. దీంతో ప్రధాని మోదీ(PM Modi) జనవరి 6న ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

రూ.430 కోట్ల వ్యయంతో నిర్మాణం

హైదరాబాద్‌(HYD)కు తూర్పు భాగంలో చర్లపల్లి టెర్మినల్ ఉండటం.. దీనికి దగ్గర్లోనే ఘట్‌కేసర్‌(Ghatkesar) వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్ (ORR) కూడా ఉండటంతో ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు సులభంగా ప్రయాణించ గలుగుతారని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్(Traffic) ఇబ్బందులు లేకుండా చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకునే వెసులుబాటు ఉంటుందని అంటున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో రైల్వేశాఖ(Department of Railways) అభివృద్ధి చేసింది.

ఈ స్టేషన్‌లో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్ట్‌లు, 6 బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్స్(Waiting halls), హైక్లాస్ వెయిటింగ్ ఏరియా(High class waiting area), గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ని నిర్మించారు. టెర్మినల్ తొలి అంతస్తులో కెఫ్ టేరియా, రెస్టారెంట్, రెస్ట్ రూమ్‌ తదితర సౌకర్యాలను కల్పించారు. ప్రయాణికులకు ఉచిత వైఫై(Free WiFi) సదుపాయం అందుబాటులో ఉంటుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *