
పెరిగిన హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు(Hyderabad Metro Rail Fare) నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇకపై కనీస ఛార్జీ(Minimum charge) రూ. 10 నుంచి రూ. 12కు చేరింది. అటు గరిష్ఠ టికెట్ ధర(Maximum ticket price) రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. ఇలా కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు ఛార్జీలు పెంచామని L&T ప్రకటించింది. మరోవైపు మెట్రో ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులు(Passengers) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన మెట్రో ఛార్జీలు ఇలా..
మొదటి 2KM వరకు రూ. 12
2 నుంచి 4KM వరకు రూ. 18
4 నుంచి 6KM వరకు రూ. 30
6 నుంచి 9KM వరకు రూ. 40
9 నుంచి 12KM వరకు రూ. 50
12 నుంచి 15KM వరకు రూ. 55
15 నుంచి 18 కి.మీ. వరకు రూ. 60
18 నుంచి 21KM వరకు రూ. 66
21 నుంచి 24KM వరకు రూ. 70
24KM నుంచి ఆపై దూరానికి రూ. 75
మెట్రో ఛార్జీల పెంపునకు కారణం ఇదేనా!
పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల(Operating expenses) కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు సమాచారం. దానికి తోడుగా..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం(Free bus scheme) కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఛార్జీలు పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా రూ.150 – రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దీంతో పాటు పార్కింగ్(Parking) రూపంలో ప్రయాణికులకు నెలకు రూ. 12 వందల నుంచి రూ.2వేల వరకు ఛార్జీ అవుతోందని మండిపడుతున్నారు.
You have to pay more for Metro train
HYDERABAD METRO RAIL
FARE REVISION EFFECTIVE FROM 17th MAY 2025
#hyderabad #METRORail pic.twitter.com/YMBVtJPIFV— Sudhakar Udumula (@sudhakarudumula) May 15, 2025