
దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం(79th Independence Day) సందర్భంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ (Telangana)లో ఘనంగా వేడుకలు జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(TG CM Revanth Reddy), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్య్ర పోరాట వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడారు.
రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: తెలంగాణ సీఎం రేవంత్
‘‘అహింసా పద్ధతిలో మహా సంగ్రామాన్ని గెలిచామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని చెప్పారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట(Golkonda Kota)లో జాతీయపతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసిందన్నారు. గతేడాది ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీ(Runamaafi)కి శ్రీకారం చుట్టాం. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. విత్తనాలు వేసే నాటికి రైతుల ఖాతాల్లో రైతుభరోసా(Rythu Bharosa) వేశాం. పరిమితులు లేకుండా 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు వేశాం. ప్రభుత్వం అండగా నిలవడంతో రైతులు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలిపారు’’ అని వ్యాఖ్యానించారు.
CM @revanth_anumula begins and ends his Independence Day speech with “JAI TELANGANA” at #GolcondaFort.#IndependenceDay#IndependenceDayIndia #jaiTelangana#JaiHind #JaiBharat pic.twitter.com/c47ZgSJBwy
— L Venkat Ram Reddy (@LVReddy73) August 15, 2025
గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
ఇక ‘‘గోదావరి(Godavari), కృష్ణా(Krishna) జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. మన వాటా సాధించేవరకు ఎవరి బెదిరింపులకు లొంగేది లేదు. మన భూములు సస్యశ్యామలం అయ్యాకే మరొకరికి నీళ్లు ఇవ్వడం గురించి ఆలోచిస్తాం. నెహ్రూ నిర్మించిన సాగర్, శ్రీశైలం, శ్రీరామ్‌సాగర్‌తోనే మనకు నీళ్లు అందుతున్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం(Kaleshwaram) పేరుతో రూ.లక్ష కోట్లను గోదావరిలో పోసింది. అంత డబ్బును వృథా చేసి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు. గోదావరి, కృష్ణా జలాల్లో మన వాటాను వదులుకోవడం జరగదు’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది: ఏపీ సీఎం చంద్రబాబు
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కు మొదటి సీఎంగా ప్రజలు తనకు అవకాశం కల్పించారని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా APని నిలిపామన్నారు. విజయవాడ(Vijayawada)లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్(AP Brand)ను నాశనం చేసింది. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. దీంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్ షేర్‌తో కూటమిని దీవించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేం అధికారాన్ని చేపట్టిన ఏడాదిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా పని చేశాం.
Vijayawada : AP CM Chandrababu Naidu participates in the 79th Independence Day celebrations #Vijayawada #AndhraPradesh #IndependenceDay pic.twitter.com/leWscC0dDZ
— Deccan Chronicle (@DeccanChronicle) August 15, 2025
బనకచర్లతో ఏ రాష్ట్రానికి నష్టం వాటిల్లదు..
ఇక రాయలసీమ(Rayalaseema)ను సస్యశ్యామలం చేసేందుకు నిర్ణయించామని. గోదావరి వృథా జలాలను పోలవరం నుంచి బనకచర్ల(Banakacharla)కు మళ్లించాలన్నారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తామని చెప్పారు. బనకచర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకూ నష్టం వాటిల్లదు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాశం జిల్లాను కరవు నుంచి బయటపడేసే వెలుగొండకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఏడాది జులై నాటికి సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు పనులు చేస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు.