హృతిక్ రోషన్(Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) నటించిన ‘వార్ 2(War2)’ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద రూ.52.5 కోట్ల నెట్ కలెక్షన్(Net Collections)తో సక్సెస్ అందుకుంది. యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) నిర్మించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్, అయాన్ ముఖర్జీ(Ayan Mukherji) దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం రజనీకాంత్ నటించిన ‘కూలీ(Cooli)’తో బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర పోటీని ఎదుర్కొంది. ‘కూలీ’ తొలి రోజు రూ.65 కోట్ల కలెక్షన్‌తో ముందంజలో ఉన్నప్పటికీ, ‘వార్ 2’ కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. సాక్‌నిల్క్ రిపోర్ట్ ప్రకారం, ‘వార్ 2’ హిందీ వెర్షన్ రూ.29 కోట్లు, తెలుగు వెర్షన్ రూ. 23.25 కోట్లు, మిగిలిన భాషల నుంచి రూ. 0.25 కోట్లు సాధించింది.
హైదరాబాద్‌లో 74.97% ఆక్యుపెన్సీ రేటు
తెలుగు ప్రేక్షకులలో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కారణంగా హైదరాబాద్(Hyderabad)లో 74.97% ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. అయితే, హిందీ బెల్ట్‌లో 29.24% ఆక్యుపెన్సీతో సాధారణ ప్రదర్శన కనబరిచింది. చెన్నైలో హిందీ షోలు 77.50% ఆక్యుపెన్సీని సాధించాయి.ఈ చిత్రం 2019లో విజయవంతమైన ‘వార్’ సీక్వెల్‌గా రూపొందింది.
రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది
ఇందులో హృతిక్ రోషన్ రా(RAW) ఏజెంట్ కబీర్‌గా, జూనియర్ ఎన్టీఆర్ విక్రమ్(Vikram)గా నటించారు. కియారా అడ్వాణీ(Kiara Advani), అనిల్ కపూర్, ఆశుతోష్ రాణా, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా హృతిక్, ఎన్టీఆర్‌ల స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్‌లో మరింత జోరు అందుకునే అవకాశం ఉంది.
War 2 Box Office Collection Day 1: Hrithik Roshan-Jr NTR Film Earns Rs 52.5 Crore, With Second Highest Hindi Opening In 2025…#war2 #War2Review #CoolieReview #IndependenceDay #HrithikRoshan #JrNTR pic.twitter.com/uYKHJHmLwi
— Sameerhusen 🇮🇳 (@Samirhusenagani) August 15, 2025






