INDvsSA 1st T20: సంజూ సూపర్ సెంచరీ.. సఫారీలపై గ్రాండ్ విక్టరీ

ManaEnadu: సొంతగడ్డపై కివీస్‌(New zealand) చేతిలో ఘోర పరాజయం చవిచూసిన భారత్(India) తాజా దక్షిణాఫ్రికా(South Africa) టీ20 సిరీస్‌లో దుమ్ము రేపింది. సఫారీ గడ్డపై డర్బన్(Durban) వేదికగా జరిగిన తొలి T20లో యంగ్ ఇండియా 61 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ సంజూ శాంసన్(Sanju Samson) సూపర్ సెంచరీతో సాధించడంతో 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేజింగ్‌లో సఫారీలు చతికిల పడ్డారు. 17.5 ఓవర్లలో 141 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టు బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (25) టాప్ స్కోరర్. కోయెట్జీ (23), రికెల్టన్ (21), మిల్లర్ (18) రన్స్ చేశారు. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి 3, రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీశారు. అవేశ్ 2, అర్ష్‌దీప్ ఒక వికెట్ పడగొట్టారు. సెంచరీతో చెలరేగిర సంజూ ‘Player Of The Match’గా నిలిచాడు.

ఆరంభం నుంచే శాంసన్ షో

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ భారీ స్కోరు సాధించింది. సంజూ శాంసన్ సెంచరీ((Sanju Samson Centuty)తో అదరగొట్టాడు. ఆరంభం నుంచి భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (7) తన పేలవ ఫామ్ కొనసాగించగా.. సూర్యకుమార్ యాదవ్‌(SKY)తో (17 బంతుల్లో 21) కలిసి సంజూ శాంసన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 27 బంతుల్లోనే శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్య ఔటైన తర్వాత వచ్చిన తిలక్ వర్మ(Tilak varma) కూడా ధాటిగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో బ్యాట్ ఝుళిపించాడు. అయితే హిట్టింగ్ చేసే క్రమంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 202/8 రన్స్ చేసింది. కాగా ఈ విజయంతో భారత్ మూడు T20ల సిరీస్‌లో 1-0 లీడ్ సాధించింది. రెండు జట్ల మధ్య రెండో T20 రేపు (NOV 10) జరగనుంది.

https://twitter.com/FatyanKumar/status/1855064601538462082

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *