
టీమ్ ఇండియా(TeamIndia) 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ర్యాంకింగలో మూడో స్థానానికి చేరుకుంది, ఇంగ్లాండ్(England)పై ఓవల్‌లో ఉత్కంఠగా జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో 6 పరుగుల అద్భుత విజయంతో ఈ ఘనత సాధించింది. ఈ విజయం అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy) సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అదే సమయంలో భారత జట్టు WTCలో గణనీయమైన పురోగతి సాధించింది. ఐదు మ్యాచ్‌ల నుంచి 28 పాయింట్లతో భారత్ 46.67 శాతం(PCT) పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టింది. దీంతో ఇంగ్లిష్ జట్టు 26 పాయింట్లతో 43.33 PCTతో నాలుగో స్థానానికి పడిపోయింది.
టాప్-2లో ఆస్ట్రేలియా, శ్రీలంక
ఇంగ్లాండ్‌కు లార్డ్స్ టెస్ట్‌లో స్లో ఓవర్ రేట్(Slow Over Rate) కారణంగా రెండు పాయింట్ల జరిమానా విధించడంతో ఆ జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా(Australia) 100 PCTతో టేబుల్లో అగ్రస్థానంలో ఉంది. వెస్టిండీస్‌పై 3-0 సిరీస్ విజయంతో ఆ జట్టు మెరుగైన స్థానంలో నిలిచింది. ఆ తర్వాత శ్రీలంక(Srilanka) 66.67 PCTతో రెండవ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ ఐదవ స్థానంలో, వెస్టిండీస్ ఆరవ స్థానంలో ఉన్నాయి, న్యూజిలాండ్, పాకిస్థాన్, డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికా ఇంకా ఈ సైకిల్లో ఆడలేదు. కాగా ఈ విజయం భారత జట్టుకు డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో బలమైన పునాది వేసింది.
Here’s the updated points table of the WTC 2025–27 after the Anderson-Tendulkar Trophy ended in a draw.#ENGvsIND #PointsTable #WTC #CricTracker pic.twitter.com/0cAUTzogjw
— CricTracker (@Cricketracker) August 4, 2025