భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)కి మరో దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం(Highest civilian award) దక్కింది. ఐదు దేశాల పర్యటనలో చివరిగా నమీబియా(Namibia)కు వెళ్లిన మోదీ.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్షియా మిరాబిలిస్(Order of the Most Ancient Welwitschia Mirabilis)’ను అందుకున్నారు. ఈ మేరకు నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది-ద్వైత్వా(Netumbo Nandi-Ndaitwah) ఈ గౌరవాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. ఈ పురస్కారం పొందిన తొలి భారతీయ నేతగా PM మోదీ నిలవడం గమనార్హం. ఈ పురస్కారంతో 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీకి 27వ అంతర్జాతీయ పురస్కారాలు(International awards) అందుకోవడం విశేషం.
నమీబియాలో పర్యటించిన 3వ భారత ప్రధానిగా మోదీ
కాగా PM హోదాలో మోదీ నమీబియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఆ దేశ అధ్యక్షురాలితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆరోగ్య సంరక్షణ(Health), ఇంధనం వంటి కీలక రంగాల్లో సహకారం కోసం నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు. కాగా, నమీబియాలో పర్యటించిన మూడో భారత ప్రధానిగా మోదీ నిలిచారు.
#WATCH | Windhoek, Namibia: PM Narendra Modi receives a standing ovation after his address at the Parliament of Namibia. #PMModi #Namibia #Windhoek pic.twitter.com/yYEoP3Kal1
— TIMES NOW (@TimesNow) July 10, 2025
భారత్‌కు పయనమైన మోదీ
ఈ నెల 2న ప్రారంభమైన ప్రధాని ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటికే ఘనా(Ghana), ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలను సందర్శించారు. బ్రెజిల్‌లోని రియోలో జరిగిన బ్రిక్స్ సదస్సు(BRICS conference)లోనూ పాల్గొన్నారు. ఈ పర్యటనలో అర్జెంటీనా మినహా మిగిలిన నాలుగు దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకోవడం విశేషం. ఇక ఐదు దేశాల పర్యటన ముగించుకొని మోదీ భారత్‌కు పయనమయ్యారు.






