ఆసియా కప్(Asia Cup 2025) కోసం భారత క్రికెట్ జట్టు(Team India) సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో T20 ఫార్మాట్లో జరగనుంది. ఈ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadhav) నేతృత్వంలో సిద్ధమవుతోంది. అయితే, అభిమానులకు సూపర్ న్యూస్ వచ్చేసింది. టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఈ టోర్నమెంట్లో ఆడే అవకాశం ఉంది. ఈ మేరకు బుమ్రా తాజాగా BCCIకి సమాచారం ఇచ్చాడని, ఆసియా కప్ సెలక్షన్‌కి అందుబాటులో ఉంటానని చెప్పినట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి.
బుమ్రా ఎంట్రీ బౌలింగ్ యూనిట్‌కు ప్లస్
టీ20లలో మంచి రికార్డు ఉన్న బుమ్రా ఆడడం టీమ్ ఇండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఇక ఈ టోర్నమెంట్ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్(Siraj)కు ఛాన్స్ లేదనే తెలుస్తోంది. బుమ్రాతో పాటు అర్ష్ దీప్(Arshdeep SIngh) బౌలర్ గా రంగంలోకి దిగనున్నాడట. ఇక హార్దిక్ పాండ్య అలాగే శివం దూబే.. ఆల్ రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. ఓపెనర్లుగా సంజు, అభిషేక్ శర్మ ఉండే ఛాన్స్ ఉంది. విరాట్ కోహ్లీ తరహాలో ఫస్ట్ డౌన్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బరిలోకి దిగుతాడు. రింకూ స్థానంలో జితేష్ శర్మ ఫినిషర్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. బుమ్రాతో పాటు, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ బౌలర్లు బౌలింగ్ విభాగాన్ని హ్యాండిల్ చేయవచ్చు. అయితే బుమ్రా లేని సందర్భంలో ఖలీల్ అహ్మద్‌కు ఛాన్స్ దక్కొచ్చు. కాగా BCCI ఆగస్టు 19న జట్టును ప్రకటించనుంది.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Jasprit Bumrah has informed the selectors that he is available for the Asia Cup! 🏆🇮🇳🔥
Team India’s pace spearhead is back in action! 💪⚡
.#JaspritBumrah #AsiaCup #CricketImpluse pic.twitter.com/OAydPbwrlp— Cricket Impluse (@cricketimpluse) August 17, 2025
భారత జట్టు అంచనా
అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (C), శుభమన్ గిల్, రింకూ సింగ్, సంజూ శాంసన్(Wk), జితేశ్ శర్మ(Wk), హర్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే/ నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి/ కుల్దీప్ యాదవ్.






