సింధూ నదీ జలాల ఒప్పందం(Indus Waters Treaty) విషయంలో ఇదివరకు దూకుడుగా వ్యవహరించిన పాకిస్థాన్(Pakistan) వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఒప్పందాన్ని నిలిపివేస్తే ఎదురయ్యే తీవ్ర పరిణామాలను గ్రహించిన ఆ దేశం, ఈ అంశంపై తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని భారత్(India)ను అభ్యర్థించింది. సింధూ జలాల విషయంలో తగ్గేది లేదని భారత్ పదేపదే తేల్చి చెప్పడంతో పాకిస్థాన్ తానే వెనక్కి తగ్గింది. ఈ మేరకు భారత ప్రభుత్వాని(Indian Govt)కి లేఖ రాసింది.
రక్తం, నీరు రెండూ ఏకకాలంలో ప్రవహించలేవు: PM మోదీ
సింధూ నదీ జలాలను భారత్ నిలిపివేస్తే తమ దేశంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు(Famine conditions) తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ(Pakistan’s Ministry of Water Resources), భారత జలశక్తి మంత్రిత్వ శాఖ(Ministry of Hydropower of India)కు ఒక లేఖ రాసినట్లు సమాచారం. ఈ సున్నితమైన అంశంపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఆ లేఖలో పేర్కొంది. నిబంధనల ప్రకారం, ఈ లేఖను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(Ministry of External Affairs of India)కు పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో భారత్ తన వైఖరిని ఇదివరకే స్పష్టం చేసింది. “రక్తం, నీరు రెండూ ఏకకాలంలో ప్రవహించలేవు” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గతంలోనే తేల్చిచెప్పారు.
All gates of Baglihar Dam on the Chenab River remain FULLY CLOSED.
With the Indus Waters Treaty in abeyance, India will decide the flow — not Islamabad.pic.twitter.com/i15e0IjVkz
— The Random Guy (@RandomTheGuy_) May 14, 2025






