India-Pak Conflict: పాక్‌ F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారత్

జమ్మూకశ్మీర్‌(Jammu And Kashmir) సహా పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పాకిస్థాన్‌ దాడుల(Pakistan Attacks)కు తెగబడింది. జమ్మూ ఎయిర్‌ పోర్టుతోపాటు జైసల్మేర్‌ విమానాశ్రయం లక్ష్యంగా దాడులకు యత్నించినట్లు తెలుస్తోంది. వీటిని దీటుగా ఎదుర్కొంటున్న భారత సైన్యం(Indian Army) దాయాది డ్రోన్ల(Drones)ను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తోంది. అంతకుముందు పాకిస్థాన్‌కు చెందిన ఓ F-16 యుద్ధ విమానాన్ని భారత రక్షణ వ్యవస్థ(Indian Defense System) కూల్చివేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు రెండు JF-17 యుద్ధవిమానాలను సైతం దెబ్బతీసినట్లు సమాచారం.

ఆర్మీ అదుపులో పాకిస్థాన్ పైలట్

పాకిస్థాన్‌ వాయుసేనకు చెందిన F-16 సూపర్‌సోనిక్‌ విమానం(Supersonic aircraft) అక్కడి సర్గోధ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి టేకాఫ్‌ అయ్యింది. అదే సమయంలో భారత్‌కు చెందిన ఎస్‌ఏఎం (Surface to Air missile) రక్షణ వ్యవస్థ.. ఆ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పాకిస్థాన్‌కు చెందిన పైలట్‌ను భారత ఆర్మీ సజీవంగా పట్టుకుంది. రాజస్థాన్ జైసల్మేర్‌లో అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *