
భారత్, పాకిస్థాన్(India vs Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు(Tense situations) నెలకొన్నాయి. జమ్ము కశ్మీర్(Jmmu and Kashmir), రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో బ్లాక్ అవుట్ వాతావరణం ఏర్పడింది. జమ్ము విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాలను పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. డ్రోన్ దాడులు(Drone Attacks) జరుగుతున్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రాజస్థాన్ లోని జైసల్మేర్‌లో పాకిస్థాన్ డ్రోన్‌ను భారత సైన్యం కూల్చివేసింది. అమృత్‌సర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
కంట్రోల్ రూమ్ నంబర్ ఏర్పాటు
క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకునేందుకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్(Control Room)ను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయం కోసం 0172-2741803, 0172-2749901 నంబర్లలో రెవెన్యూ విపత్తు నిర్వహణ పర్యవేక్షణ కేంద్రాన్ని సంప్రదించవచ్చని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.
విద్యాసంస్థలకు సెలవులు
విమానాశ్రయాలు(Airports), విమానాలలో భద్రతను కట్టుదిట్టం చేసింది. విమానాశ్రయాల్లో ప్రయాణికులందరూ ప్రీ-బోర్డింగ్ చెక్ చేయించుకోవాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(Bureau of Civil Aviation Security) ఆదేశించింది. టెర్మినల్‌లలోకి సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ము, సాంబా, కథువా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బార్మర్, బికనీర్, శ్రీగంగానగర్, జైసల్మేర్ సహా రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లోని పాఠశాలలకు తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు సెలవులు ప్రకటించారు.
धर्म के लिए युद्ध करना पाप नहीं होता,
अधर्म का नाश करना ही धर्म है।जय मां भारती।
जय मां तनोट।
हर हर महादेवहम सब देश के वीर जवानों के साथ अदम्य साहस के साथ खड़े है।#IndiaPakistanWar #IndianArmy#OperationSindhoor pic.twitter.com/jCLdwzSxkM
— आदेश बिश्नोई (@AadeshBish9i) May 8, 2025