ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న మ్యాచులో భారత్(India) టాస్ ఓడింది. దుబాయ్(Dubai) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 14వ సారి టాస్ ఓడిపోయి చరిత్రకెక్కాడు. ఇక ఈ మ్యాచులో భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. అటు ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు చేసింది. షార్ట్, జాన్సన్ స్థానాలలో కూపర్, సంఘ జట్టులోకి వచ్చారు. కాగా ఈ మ్యాచులో గెలిచి ప్రపంచకప్(WC 2023), వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC)లలో ఆస్ట్రేలియాతో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ మ్యాచ్‌లకూ ఐసీసీ రిజర్వ్ డే(Reserve Day) కేటాయించడం గమనార్హం.
తుది జట్లు..
భారత్: రోహిత్ శర్మ(C), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్(WK), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
ఆస్ట్రేలియా: కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (C), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (w), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ
Take a look at the playing XIs for the high-voltage India vs. Australia clash in the Champions Trophy 2025.
🇮🇳 India: Unchanged
🇦🇺 Australia: Cooper Connolly replaces Matthew Short, and Tanveer Sangha comes in for Spencer Johnson.#INDvsAUS pic.twitter.com/WegYWY5wPv— CricTracker (@Cricketracker) March 4, 2025






