
యంగ్ టైగర్ NTR బాలీవుడ్‌లో నటిస్తున్న డెబ్యూ మూవీ ‘వార్ 2’. స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి ఈ మూవీలో తారక్ నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇక దేవర(Devara) తర్వాత NTR అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చేస్తున్న ఈ ప్రాజెక్టులో తారక్ నెగటివ్ షేడ్స్ ఉన్న ‘RAW’ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడని బీటౌన్‌లో వార్తలు వినిపించాయి. ఇక హృతిక్ కూడా ఏజెంట్ గానే కనిపించబోతున్నాడని టాక్. కియారా అద్వానీ(Kiara Advani) ఫీమేల్ లీడ్ చేస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ(Ajayn Mukerjee) డైరెక్ట్ చేస్తున్నాడు.
500 మంది డ్యాన్సర్లతో..
తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. తారక్-హృతిక్‌ల మధ్య ఓ స్పెషల్ సాంగ్(Special Song)కు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పాట కోసమే ఏకంగా 500 మంది డ్యాన్స్ర్లను మేకర్స్ రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి. 500 మంది డ్యాన్సర్లతో హృతిక్, NTR డ్యాన్స్ చేస్తుంటే థియేటర్‌లు ఏ రేంజ్‌లో ఊగిపోతాయో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇది RRR సినిమాలోని “నాటు నాటు” సాంగ్ కంటే చాలా హెవీగా ఉంటుందట. హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే ఈ డ్యాన్స్‌లో మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని టాక్ నడుస్తోంది.
నెల రోజుల నుంచే రిహార్సల్స్
ప్రస్తుతం యష్‌రాజ్ స్టూడియోలో ఈ డ్యాన్స్ షూటింగ్ నేటి నుంచి జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన రిహార్సల్స్ నెల రోజుల నుంచే జరిగాయట. గ్రూప్ డాన్సర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తారక్, హృతిక్ ఇద్దరూ వర్క్ షాప్స్‌లో పాల్గొన్నారు. పర్ఫెక్షన్ కోసం రాజీ లేకుండా కష్టపడుతున్నారు. కాగా ఈ మూవీని ఆగస్టు 14న పాన్ ఇండియా రేంజ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే రిలీజ్ డేట్‌పై మేకర్స్ అఫిషీయల్‌గా అనౌన్స్ చేయాల్సి ఉంది.