లీడ్స్(Leads) వేదికగా ఇంగ్లండ్(England)తో జరుగుతున్న తొలి టెస్టు(First Test) తొలి ఇన్నింగ్స్‌లో భారత్(Team India) 471 పరుగులకు ఆలౌట్ అయింది. 359/3 పరుగులతో శనివారం రెండోరోజు ఆటను ఆరంభించిన భారత్ లంచ్ సమయానికి 454/7 వికెట్లతో నిలిచింది. ఆ తర్వాత కాసేపటికే బుమ్రా (0), జడేజా (11), ప్రసిద్ధ్ (1) వెంటవెంటనే ఔటయ్యారు. అంతకుముందు నిన్న శతకంతో మెరిసిన కెప్టెన్ గిల్(Gill) ఈ రోజు మరో 20 పరుగులు జోడించి (147) పరుగుల వద్ద ఔటయ్యాడు. వికెట్ కీపర్ కమ్ పంత్(Pant) తనదైన స్టైల్లో చెలరేగి ఆడాడు. నిన్న 65 రన్స్ చేసిన పంత్ ఈరోజు భారీ షాట్లతో చెలరేగి ఆడాడు.
సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసిన పంత్
ఈ క్రమంలో 99 పరుగుల వద్ద భారీ సిక్సర్(Six) కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే గిల్ ఔట్ అయిన కొద్దిసేపటికే (134) పరుగుల వద్ద టంగ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. మిడిల్డార్ బ్యాటర్ కరుణ్ నాయర్ (0) పోప్ పట్టిన సూపర్ క్యాచ్‌కు డకౌట్ అయ్యాడు. లంచ్‌కు ముందు చివరి ఓవర్లో శార్దూల్ (1)రన్ చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్(Stokes), టంగ్ చెరో 4 వికెట్లతో రాణించారు. కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. భారత్ 500 పరుగులు క్రాస్ చేస్తుందని అంతా భావించగా అనూష్యంగా కుప్పకూలింది. చివరి 7 వికెట్లను కేవలం 41 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.
Top 5 Indian Test Batters of All Time. 🕸️
Rishabh Pant 🔥 #INDvsENG pic.twitter.com/3tvaJh5hyS
— The Cinéprism (@TheCineprism) June 21, 2025






