IND vs ENG 3rd T20: నేడే మూడో టీ20.. కుర్రాళ్లు సిరీస్ పట్టేస్తారా?

పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియా(Team India) కుర్రాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు T20ల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన సూర్య సేన మరో పోరుకు సిద్ధమైంది. నేడు (జనవరి 28) రాజ్‌కోట్‌(Rajkot)లోని నిరంజన్‌ షా స్టేడియం వేదికగా మూడో T20లో బట్లర్ సేనపై అదే ఆధిపత్యం కొనసాగించి భారత్ ఖాతాలో మరో పొట్టి సిరీస్ చేర్చాలని కుర్రాలు చూస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఇంగ్లిష్ జట్టుకంటే సూర్య(SKY) సేన మెరుగైన పొజిషన్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచులో సీనియర్ బౌలర్ షమీ(Shami)కి అవకాశం ఇస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు. మరోవైపు రెండు మ్యాచుల్లోనూ ఓడిన ఇంగ్లండ్(England) ఈ మ్యాచులో ఎలాగైనా గెలిసి సిరీస్ సజీవంగా నిలుపుకోవాలని భావిస్తోంది. ఆ జట్టు బ్యాటర్లు విఫలమవడం బట్లర్ సేనకు తలనొప్పిగా మారింది.

కెప్టెన్‌ ఫామ్‌లోకి వచ్చేనా?

గతేడాది రోహిత్‌ శర్మ(Rohit Sharma) పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత భారత జట్టు పగ్గాలను అందుకున్న సూర్య.. కెప్టెన్‌ అయ్యాక స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. సారథి(Captain)గా జట్టుకు వరుస విజయాలను అందిస్తున్నా.. వ్యక్తిగతంగా అతడి ఫామ్‌ మాత్రం ఆందోళనకరంగా ఉంది. గత 17 ఇన్నింగ్స్‌లలో సూర్య.. 26.81 సగటుతో 429 పరుగులే చేశాడు. సూర్య కెరీర్‌లో ఇదే అత్యల్ప సగటు. ఇక సౌతాఫ్రికా(SA) సిరీస్‌లో వరుస సెంచరీలతో దుమ్మురేపిన సంజూ శాంసన్‌(Sanju Samson).. ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌లలోనూ షార్ట్‌ బాల్స్‌కు ఔట్‌ అయ్యాడు. అటు రింకూ, నితీశ్‌ గాయాలతో దూరం కాగా, ఈ మ్యాచ్‌లో శివమ్‌ దూబే, రమణ్‌దీప్‌ సింగ్‌ను ఆడించే అవకాశాలున్నాయి.

IND vs ENG : Suryakumar Yadav On Cusp Of History In 2nd T20I, All Set To  Enter Elite List - myKhel

జట్ల అంచనా

INDIA: సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌(C), హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్, వాషింగ్టన్ సుందర్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్, వరుణ్ చక్రవర్తి.

ENGLAND: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(C), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

Related Posts

SRH vs PBKS: అభిషేక్ ఊచకోత.. పంజాబ్‌పై సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ

వారెవ్వా.. వాట్ మ్యాచ్.. ఏమా ధైర్యం.. ఏమిటా హిట్టింగ్.. వరల్డ్స్ క్లాస్ బౌలర్లను చిత్తు చేస్తూ అభిషేక్ వర్మ చేసిన విధ్వంసం గురించి ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి.. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన…

IPL ఓపెనింగ్ సెర్మనీ.. సందడి చేయనున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న ప్రారంభం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *