మహాసమరానికి సమయం ఆసన్నం అయింది. కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy-2025) తుది సమరానికి దుబాయ్(Dubai) సిటీ వేదికగా నిలవనుంది. 8 జట్లు పాల్గొన్న ఈ మెగా సమరంలో అసలు సిసలైన రెండు మేటి జట్లు ఈరోజు ఫైనల్లో నువ్వా? నేనా? అంటూ పోటీ పడపోతున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్ వర్సెస్ న్యూజిలాండ్(IND VS NZ) జట్లు మరో మెగా సమరానికి సై అంటున్నాయి. ప్రేక్షకులకు అసలుసిసలైన మజా అందించేందుకు రెడీ అయ్యాయి. అటు అభిమానులు సైతం ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. లైవ్ మ్యాచ్ 2.30కు ప్రారంభం కానుండగా.. జియోహాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెళ్లలో లైవ్ చూడొచ్చు.
వరుసగా మూడో సారి ఫైనల్‌కి భారత్
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ ఇరుజట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్(League Match)లో భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది. వరుసగా 3 విజయాలతో గ్రూప్-Aలో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో(Semfinal) వన్డే ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా(AUS)ను నాలుగు వికెట్ల తేడాతో చిత్తు చేసి వరుసగా మూడోసారి ఫైనల్‌కి దూసుకొచ్చింది. మరోవైపు, న్యూజిలాండ్ కరాచీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆతిథ్య పాకిస్థాన్(PAK)పై విజయంతో తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్ విజయం, భారత జట్టుపై ఓటమిని ఎదుర్కొంది. సెమీ-ఫైనల్స్‌లో బ్లాక్‌క్యాప్స్ సఫారీల(SA)ను 50 రన్స్ తేడాతో మట్టికరిపించి టీమ్ఇండియా(Team India)తో తుది ఫైట్‌కి సిద్ధమైంది.
Best Of Luck Team India 🇮🇳
ॐ नमः पार्वती पते हर हर महादेव जी 🔱#indvsnzfinal #ChampionsTrophyFinal #ChampionsTrophy #INDvNZ pic.twitter.com/MN9zAAb146
— PANKAJ GANGWAR (@pankajgangwar0) March 8, 2025
ఓవరాల్‌గా మనదే పైచేయి.. కానీ!
ఇక వన్డేల్లో ఇరు జట్లు ఇప్పటి వరకు 119 మ్యాచుల్లో తలపడగా భారత్ 61 వన్డేల్లో నెగ్గింది. కివీస్ 50 మ్యాచుల్లో గెలవగా.. ఒకటి టై అయింది. మరో 7 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఓవరాల్‌గా వన్డేల్లో భారత్ దే పైచేయి. అయితే ఐసీసీ ఈవెంట్ల(ICC Events)లో మాత్రం ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. మొత్తం 10 మ్యాచుల్లో తలపడగా చెరో 5 మ్యాచుల్లో నెగ్గాయి. మరి ఇవాళ్టి మ్యాచులో ఎవరు విక్టరీ కొట్టి పైచేయి సాధిస్తారో వేచి చూడాలి. ఇక నేటి దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ వైపు మొగ్గుచూపొచ్చు.
తుది జట్ల అంచనా
టీమ్ఇండియా: రోహిత్ శర్మ (C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (WK), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి.
న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ (WK), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (C), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, మాట్ హెన్రీ/నాథన్ స్మిత్






