Mana Enadu: మహిళల టీ20 ప్రపంచకప్(Women’s T20 World Cup)లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత్, శ్రీలంక(India vs Sri Lanka) జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే చెరో రెండు మ్యాచులు ఆడిన ఈ రెండు జట్లూ టోర్నీలో ముందడుగు వేయాలంటే నేటి మ్యాచ్ కీలకంగా మారనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్(NZ)పై 58 పరుగుల తేడాతో ఓడటంతో నెట్ రన్ రేట్(Net Run Rate) చాలా తగ్గిపోయింది. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్(PAK)పై ఏడు వికెట్ల తేడాతో నెగ్గినా పాయింట్స్ టేబుల్లో మాత్రం నాలుగో స్థానంలోనే ఉంది. మరోవైపు శ్రీలంక ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ మీద 31 రన్స్‌తో, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(AUS) చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. కాగా ఇవాళ రాత్రి భారత్, శ్రీలంక మధ్య దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
నాలుగో స్థానంలో హర్మన్ ప్రీత్ సేన
ప్రస్తుతం టీమ్ఇండియా రన్ రేట్ చాలా తక్కువగా ఉంది. పాకిస్థాన్ జట్టు పైన భారీ రన్ రేట్ తో గెలిస్తే ఈ టెన్షన్ ఉండేది కాదు. కానీ చాలా స్లోగా ఆడిన భారత్ విజయం సాధించినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రస్తుతం టీమ్ ఇండియా(Team India) రన్ రేట్ నెగటివ్‌లోనే ఉంది. ప్రస్తుతం భారత్ రన్ రేట్ -1.217గా ఉంది. అటు మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీమ్ఇండియాపై విజయం సాధించిన న్యూజిలాండ్(NZ) ఆస్ట్రేలియా(AUS)పై భారీ ఓటమితో మూడోస్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ రెండో ప్లేస్‌లో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా భారీ నెట్ రన్ రేట్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన శ్రీలకం(SL) చివరి స్థానంలో ఉంది.
ఆ రెండు మ్యాచుల్లో తప్పక నెగ్గితేనే..
ఇదిలా ఉండగా ప్రతి గ్రూప్‌లో టాప్ రెండు స్థానాల్లో నిలిచిన జట్లకే సెమీస్(Semis) చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు దాదాపు సెమీస్ బెర్త్ కన్ఫామ్ అయినట్లే. మరోదాని కోసం పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్ పోటీలో ఉన్నాయి. భారత్ సెమీస్ చేరాలంటే ఇవాళ శ్రీలకంపై గెలవడంతోపాటు, ఈనెల 13న ఆస్ట్రేలియాపై కూడా తప్పక నెగ్గాల్సిందే. దీంతోపాటు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తమ రెండు మ్యాచుల్లో ఒక మ్యాచ్ తప్పక ఓడిపోవాలి. అప్పుడే భారత్‌కు సెమీస్ అవకాశాలు ఉంటాయి. అయితే ఇటీవల ఆసియా కప్ ఫైనల్(Asia Cup Final)లో శ్రీలంక భారత్‌పై నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై గెలవాలంటే హర్మన్ ప్రీత్ సేన చెమటోడ్చక తప్పదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి. సెమీస్ చేరే జట్లేవో.. ఇంటి దారి పట్టే జట్లేవో తర్వలోనే తెలియనుంది.








