బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston)లో జరిగిన ఇంగ్లండ్(England)తో రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా(Team India) తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు సాధించి బలమైన స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన సెంచరీ (114 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు, రవీంద్ర జడేజా (41 నాటౌట్)తో కలిసి 99 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
భారత్‌ను నిలబెట్టిన గిల్-జడేజా భాగస్వామ్యం
తొలి సెషన్‌లో భారత్ 98/2 స్కోరు సాధించగా, యశస్వి జైస్వాల్ (87) పరుగులతో మరో సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ స్టోక్స్ బౌలింగ్‌లో కీపర్ స్మిత్(Smith)కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కరుణ్ నాయర్ (31), కేఎల్ రాహుల్ (2) త్వరగా ఔటయ్యారు. గిల్, జైస్వాల్ జోడీ రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించింది. రిషబ్ పంత్ (3), నీతీష్ కుమార్ రెడ్డి వికెట్లను వెంటవెంటనే కోల్పోయిన భారత్ 211 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ గిల్ బాధ్యతాయుతంగా ఆడుతూ ఈ సిరీస్(Series)లో రెండో సెంచరీ(Century) నమోదు చేశాడు. మరో ఎండ్‌లో జడేజా(Jadeja) గిల్‌కు సహకరించాడు. వీరిద్దరూ తొలి రోజు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.
📍 Stumps on Day 1
India: 310/5 🇮🇳
Shubman Gill stands tall with a superb 💯* — anchoring the innings at #Edgbaston! 🧱🔥
Can he go big on Day 2?#ENGvsIND #ShubmanGill #TestCricket #WTC2027 #Day1Stumps #CricketTwitter #IceCricNews pic.twitter.com/36cnqQAbfX
— IceCricNews (@icecric_news) July 2, 2025
కెప్టెన్ గిల్ అరుదైన ఘనత
కాగా ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 2 వికెట్లు తీయగా.. కార్స్, స్టోక్స్, బషీర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా ఈ సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు నమోదు చేసిన గిల్.. ఓ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై రెండుసార్లు ఓ టెస్టు మ్యాచ్ మొదటి రోజే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. ఓవరాల్‌గా 13వ ప్లేయర్‌గా నిలిచాడు. కాగా గిల్, రెండు సెంచరీలు ఈ సిరీస్‌లోనే చేయడం విశేషం. అంతకుముందు గిల్ ఏ దేశంలోనూ తొలిరోజు శతకం చేయలేదు.






