ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళల(India Womens) క్రికెట్ జట్టు అదరగొడుతోంది. ఐదు మ్యాచుల టీ20ల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు మ్యాచుల్లో ఘనవిజయం సాధించి హర్మన్ సేన ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈనేపథ్యంలో ఇవాళ (జులై 4) ఆతిథ్య జట్టుతో మూడో టీ20 ఆడనుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్(Kennington Oval)లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 11.30 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీలివ్, ఫ్యాన్‌కోడ్‌లలో లైవ్ చూడొచ్చు. కాగా ఈ మ్యాచులోనూ గెలిసి ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్‌ను పట్టేయాలని భారత్ భావిస్తోంది.
ఇంగ్లండ్ జట్టుకు డు-ఆర్-డై మ్యాచ్
కాగా ఇంగ్లండ్(England)తో మొదటి T20లో భారత్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. స్మృతి మంధాన (112), హర్లీన్ డియోల్ (43) మొదటి మ్యాచ్‌లో, అమన్‌జోత్ కౌర్ (63 నాటౌట్), జెమిమా రోడ్రిగ్స్ (63) రెండో మ్యాచ్‌లో రాణించారు. శ్రీ చరణి(Sri Charani) బౌలింగ్‌లో నాలుగు వికెట్లు, రెండు వికెట్లు తీసుకుని ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చింది. ఇంగ్లండ్ జట్టుకు ఈ మ్యాచ్ డు-ఆర్-డై పరిస్థితి. కెప్టెన్ నాట్ సివర్-బ్రంట్ గాయం కారణంగా ఆడటం లేదు, టామీ బ్యూమాంట్(Tommy Beaumont) నాయకత్వం వహిస్తోంది.

బ్యాటింగ్ పిచ్‌లో మరోసారి చెలరేగుతారా?
ఇక ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలమడం ఆ జట్టును ఆందోళన కలిగిస్తోంది. బ్యూమాంట్ (54), సోఫీ ఎకెల్‌స్టోన్(Sophie Ecclestone)లు రెండో మ్యాచ్‌లో పోరాడినప్పటికీ, భారత బౌలర్ల ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. కెన్నింగ్టన్ ఓవల్ పిచ్ బ్యాటింగ్(Batting)కు అనుకూలంగా ఉంటుంది, సగటు స్కోరు 174. భారత జట్టు ఈ మ్యాచ్‌లోనూ ఆధిపత్యం కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది. టీమ్ఇండియాకు దీప్తి శర్మ, స్మృతి మంధాన(Smriti Mandhana), అమన్‌జోత్ కౌర్, రోడ్రిగ్స్(Rodrigs) కీలకం కానున్నారు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
IND W vs ENG W: इतिहास रचने की कगार पर टीम इंडिया, आज जीत की हैट्रिक के साथ सीरीज फतह पर निगाहें#INDvsENG #ENGvsIND #TeamIndia #smritimandhana #fitsportsindia #CurrentSports #beonnnie #cesmeyanıyor #diogojota #englot #FayeYoko https://t.co/0a6ziHl5Da via @FIT SPORTS INDIA
— fit sports india (@fitsportsindia) July 4, 2025






