ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy)లో టీమ్ఇండియా దుమ్మురేపింది. దుబాయ్ వేదికగా మంగళవారం ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన తొలి సెమీస్‌లో 4 వికెట్లతో తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. దీంతో గత ప్రపంచకప్(WC-2023) ఫైనల్లో ఆ జట్టుపై ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఎప్పటిలాగే ఛేజింగ్‌లో కింగ్ కోహ్లీ(Kohli) తనదైన స్టైల్లో రప్ఫాడించగా.. అయ్యర్, అక్షర్, రాహుల్, పాండ్య కోహ్లీకి మద్దతుగా నిలవడంతో భారత్ వరుసగా మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది.
265 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. రోహిత్ (28), కోహ్లీ (84), అయ్యర్ (45), అక్షర్ (27), రాహుల్ (42), పాండ్య (28) పరుగులతో చెలరేగారు. కాగా భారత బ్యాటింగ్‌లో కోహ్లీ ఆటే హైలైట్. అయ్యర్, అక్షర్, రాహుల్‌తో కలిసి విరాట్ విలువైన భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ విజయం సులభమైంది. ఆసీస్ బౌలర్లలో ఎల్లిస్, జంపా చెరో రెండు వికెట్లు తీశారు.
ఆసీస్ బ్యాటింగ్‌లో ఆ ఇద్దరే..
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టుకు భారత్ బౌలర్ షమీ(Shami) ఆదిలోనే షాక్ ఇచ్చాడు. యంగ్ ఓపెనర్ కూపర్‌ను డకౌట్ చేశాడు. అయితే, మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ బౌండరీలతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. అయితే, ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్ వరుణ్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. 39 పరుగులు చేసిన ట్రావిస్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత లబుషేన్ (29)ను, 27 ఓవర్లో ఇంగ్లిష్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 73 పరుగులు చేసిన స్మిత్(Smith)ను షమీ బౌల్డ్ చేశాడు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
#ViratKohli : No king “Virat Kohli” fan will pass without ♥️ liking this tweet 🫶🏻♥️
Who among you wholeheartedly wants Virat 👑 Kohli to score a century today? #INDvsAUS #ViratKohli #ViratKohli𓃵#ChampionsTrophy2025 pic.twitter.com/TS2CvO3lfk
— Niranjan Meena (@NiranjanMeena25) March 4, 2025
ఫైనల్ ప్రత్యర్థి ఎవరో?
అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ (7) కూడా వెంటనే ఔటవడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత అలెక్స్ క్యారీ (61 పరుగులు) రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లో 264 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు, జడేజా, వరుణ్ రెండేసీ వికెట్లు తీశారు. కాగా ఇవాళ సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో మార్చి9న భారత్ ఫైనల్లో తలపడాల్సి ఉంటుంది.






