
ఆపరేషన్ సిందూర్‌లో (Operation Sindoor) భాగంగా పాకిస్థాన్(Pakistan)లోని ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, సైనిక స్థావరాలు కాదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలకు తొలుత పాకిస్థాన్ తెరలేపిందని పేర్కొంది. ఏప్రిల్ 22న పహల్గాం(Pahalgam)లో పాక్ ఉగ్రమూకల దాడితో ఇది మొదలైందని తెలిపింది. అంతర్జాతీయ సమాజానికి దాయాది దేశం తప్పుడు సమాచారం అందిస్తోందని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)కు సంబంధించి కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్(Vyomika Singh)లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ(Vikram Misri) ఈ వివరాలు వెల్లడించారు.
పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని దెబ్బతీశాం..
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’’ ద్వారా దాయాది దేశంలోని ఉగ్రస్థావరాల(Terrorist camps)ను ధ్వంసం చేసింది. అయితే, పాకిస్థాన్ మాత్రం భారత నగరాలపై బుధవారం రాత్రి సమయంలో క్షిపణి దాడుల(Missile attacks)కు ప్రయత్నించిందని, భారత్ గగనతల రక్షణ వ్యవస్థ వాటిని తిప్పికొట్టినట్లు అధికారులు చెప్పారు. దీనికి ప్రతిగా భారత్ పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్(Air Defense Systems)ని దెబ్బతీసినట్లు వెల్లడించారు.
ఉగ్రవాదులకు ప్రభుత్వం అంత్యక్రియలు..
అంతేకాదు ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని ప్రపంచం ముందుంచారు. ఉగ్రవాదులకు ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించడం పాకిస్థాన్‌లో ఒక ఆచారంగా మారిందని విమర్శించారు. హతమైన ఉగ్రవాదుల శవపేటికల ముందు యూనిఫాం ధరించి ఉన్న పాక్ సైన్యం, పోలీసులు ఉన్న ఫోటోలను అంతర్జాతీయ సమాజం ముందుంచారు. శవయాత్రలో ఆర్మీ అధికారులు పాల్గొన్న విషయాన్ని చెప్పారు.
This morning, the Indian Armed Forces targeted Air Defence Radars and systems at a number of locations in Pakistan”
Lahore Air Defence System has been destroyed…#OperationSindoor2 pic.twitter.com/17dI17rukQ— shridhar (@Shridhar_31_) May 8, 2025