Shubhman Gill: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గిల్ ‘డబుల్’.. రికార్డుల మోతెక్కించిన ఇండియన్ కెప్టెన్

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston) వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England Second Test) రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) రికార్డుల సునామీ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు(High Score) సాధించగా, గిల్ 269 పరుగులతో అద్భుత డబుల్ సెంచరీ(Double Century) నమోదు చేశాడు. ఇది ఇంగ్లండ్‌లో భారత కెప్టెన్‌(Indian Captain)గా అత్యధిక వ్యక్తిగత స్కోరు (Virat Kohli 254, 2019)ని అధిగమించింది. అలాగే, ఇంగ్లండ్‌లో భారత బ్యాటర్‌గా అత్యధిక స్కోరు (222) రికార్డును గిల్ సొంతం చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ భారత టెస్ట్ క్రికెట్ చరిత్ర(Indian Test Cricket Historyలో ఏడో అత్యధిక స్కోరుగా నిలిచింది.

Image

జడేజా, సుందర్‌ల సహకారంతో..

కాగా గిల్ తన 387 బంతుల్లో మారథాన్ ఇన్నింగ్స్‌తో 203 పరుగుల భాగస్వామ్యాన్ని రవీంద్ర జడేజా (89)తో, 144 పరుగుల భాగస్వామ్యాన్ని వాషింగ్టన్ సుందర్ (42)తో నెలకొల్పాడు. ఇది భారత్‌కు ఐదో వికెట్ తర్వాత 371 పరుగుల రికార్డు స్కోరును అందించింది, ఇది 2013లో వెస్టిండీస్‌(West Indies)పై కోల్‌కతాలో సాధించిన 370 పరుగుల రికార్డును అధిగమించింది. ఈ స్కోరు బెన్ స్టోక్స్-బ్రెండన్ మెక్‌కల్లమ్(Ben Stokes-Brendon McCullum) కాంబోలో ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా అత్యధిక టోటల్‌గా నమోదైంది.

మ్యాచ్‌పై పట్టు బిగించాలంటే కట్టడి చేయాల్సిందే..

విదేశీ గడ్డపై మొదటి రెండు టెస్టుల్లో వరుస సెంచరీలు(Back to Back Centuries) సాధించిన తొమ్మిదో కెప్టెన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. అతని 114 పరుగులతో ముగిసిన డే 1 ఇన్నింగ్స్, ఇంగ్లండ్‌లో ఒక రోజులో రెండు సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా గిల్‌ను నిలిపింది. బౌలింగ్‌లో, ఆకాశ్ దీప్(Akash Deep) రెండు వికెట్లు, సిరాజ్(Siraj) ఒక వికెట్ తీసి ఇంగ్లండ్‌ను 77/3కు కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో గిల్ బ్యాటింగ్, ఫీల్డింగ్ (Super Catch))లోనూ సత్తా చాటాడు, భారత్‌ను ఆధిపత్య స్థానంలో నిలిపాడు. ఇదే ఊపులో మూడోరోజు ఇంగ్లండ్‌ను వీలైనంత తక్కువ స్కోరుకి కట్టడి చేసి మ్యాచ్‌పై పట్టు బిగించాలని శుభ్‌మన్ సేన భావిస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *