సముద్రంలో మునిగిన పడవ.. 12 మందిని కాపాడిన భారత్​, పాక్

అరేబియా సముద్రంలో (Arabian Sea) మునిగిపోయి సహాయం కోసం ఎదురుచూస్తున్న 12 మందిని భారత్​, పాకిస్తాన్​ తీర ప్రాంత రక్షణ బలగాలు (Indian Coast Guard) కాపాడాయి. భారత్​కు చెందిన అల్​ పిరాన్​ అనే నౌక.. ఈనెల 4వ తేదీన గుజరాత్​లోని పోరుబందర్​ నుంచి ఇరాన్​ వెళ్తోంది. ఈ క్రమంలోనే బలమైన గాలుల కారణంగా ఆ నౌక పాకిస్థాన్​ పరిధిలో ఉన్న ఆరేబియా సముద్రంలో భారతీయ జాలలకు అవతల మునిగిపోయింది.

 సాయం కోసం ఎదరుచూపులు

అయితే నౌక మునిగిపోతుండగానే అందులోని సిబ్బంది చిన్న పడవ సాయంతో ఎలాగోలా బయటపడ్డారు. సముద్రం మధ్యలో చిక్కుకుని సాయం కోసం ఎదురుచూడసాగారు. సాయం కోసం వారు పంపిన సందేశం ముంబయిలోని మెరిటైమ్ సెక్యూరిటీ సెంటర్​ (ఎంసీసీ) (MCC)కి చేరింది. దీంతో ఎంసీసీ వెంటనే కోస్ట్​గార్డును అప్రమత్తం చేసింది. ఆ సందేశం పాక్‌న్​లోని ఎంసీసీ సెంటర్​కు చేరగా.. పాకిస్థాన్​ తీర ప్రాంతం రక్షణ దళాన్ని (ఎంపీఎస్​ఏ)ను (MPSA) అలెర్ట్​ చేసింది.

దీంతో సముద్రంలో చిక్కుకున్నవారి రక్షణ కోసం ఎంపీఎస్​ఏ ఓ హెలికాప్టర్​ను పంపింది. భారత కోస్ట్​గార్డ్​ సార్థాక్​ అనే నౌకను పంపించింది. ఎంసీసీ సెంటర్ల సహకారంతో రెండు దేశాల తీరప్రాంత రక్షణ దళాలు అక్కడికి వెళ్లి ఆ 12 మందిని పాకాడాయి. వారిని సురక్షితంగా సార్థాక్​ నౌకలో పోరుబందర్​ తీరానికి చేర్చినట్లు కోస్ట్​గార్డ్​ వెల్లడించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *