యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు(Team India) ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్(England)కు చేరుకుంది. ఈ సిరీస్ జూన్ 20, 2025 నుంచి లీడ్స్‌లోని హెడ్డింగ్లీ వేదికగా ప్రారంభం కానుంది. ఇరుజట్లకు ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2025-27) సైకిల్ ఈ సిరీస్‌తో మొదలు కానుంది. అంతకుముందు కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్(Gambhir)తో ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గిల్, తన మొదటి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల గురించి మాట్లాడుతూ “ఆటగాళ్లతో సన్నిహిత సంబంధం ఏర్పరచడం చాలా ముఖ్యం. ఇది జట్టుగా మా విజయానికి కీలకం” అని అన్నారు.
🚨BREAKING : Indian Team Departs for England! | New Era Begins Under Shubman Gill
🎥VC – @RevSportzGlobal#ShubmanGill #GautamGambhir#TeamIndia #INDvsENG #TestCricket #TendulkarAndersonTrophypic.twitter.com/m7KlbjsoJw— 𝔸𝕁𝔸𝕐 𝕁𝔸ℕ𝔾𝕀𝔻 (@iamajayjangirr) June 5, 2025
ఇప్పటికే ఇంగ్లండ్‌లో ఇండియా A జట్టు
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ తర్వాత లేనందున, యశస్వీ జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, రిషభ్ పంత్ వంటి యువ ఆటగాళ్లపై దృష్టి సారించింది. ఇండియా A జట్టు ఇప్పటికే ఇంగ్లండ్‌లో ఉంది, మే 30 నుంచి జూన్ 2 వరకు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మొదటి అనధికారిక టెస్ట్ డ్రాగా ముగిసింది, ఇందులో కరుణ్ నాయర్ (204),యశస్వీ జైస్వాల్ (64) రాణించారు.
🗣️ “It’s really important to create a bond with the players as a captain.”#TeamIndia Test captain Shubman Gill talks about his vision and captaincy style ahead of the England tour 🙌 #ENGvIND | @ShubmanGill pic.twitter.com/c8f9oz8TXO
— BCCI (@BCCI) June 5, 2025
భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (C), రిషబ్ పంత్ (VC & WK), యశస్వీ జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (డబ్ల్యుకె), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
టెస్ట్ షెడ్యూల్ ఇలా..
1వ టెస్ట్: జూన్ 20-24, 2025, హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్ట్: జులై 2-6, 2025,ఎడ్జ్‌బాస్టన్
3వ టెస్ట్: జులై 10-14, 2025,లార్డ్స్
4వ టెస్ట్: జులై 23-27, 2025, ఓల్డ్ ట్రాఫోర్డ్
5వ టెస్ట్: జులై 31-ఆగస్టు 4, 2025, ది ఓవల్






