Mana Enadu : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు (US Election Results) వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. మ్యాజిక్ ఫిగర్కు ఆయన అతి చేరువలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికల ఫలితాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎవరొచ్చినా వాళ్ల కోసమే
అమెరికాకు తదుపరి అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనా వారి సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తారని జైశంకర్ అన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విదేశాంగ మంత్రులతో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ మేరకు కామెంట్స్ చేశారు. ‘అభ్యర్థుల అభిప్రాయాలు ప్రజల ప్రాధాన్యతలకు విరుద్ధంగా ఉంటాయని.. ఇది ఒబామా (Obama) నుంచి మొదలయ్యిందని తెలిపారు.
ప్రపంచం అందుకు సిద్ధం కావాలి
అమెరికా అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటుందన్న జై శంకర్.. ట్రంప్(Donald Trump) ఆ విషయంలో మరింత స్పష్టంగా, భావవ్యక్తీకరణతో ఉండవచ్చ పేర్కొన్నారు. కానీ, వాస్తవంగా అమెరికా పరిపాలన భావజాలాన్ని జాతీయంగా చూడటమే చాలా ముఖ్యం’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రస్తుతం అమెరికా నుంచి అందుతున్న దాతృత్వం కొనసాగే అవకాశాలు తగ్గుతాయని… అందుకు ప్రపంచం సిద్ధం కావాలని తెలిపారు.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల సంబురాలు
మరోవైపు అమెరికా ఎన్నికల ఫలితాలతో రిపబ్లికన్ పార్టీ (US Republican Party) అభ్యర్థులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందని అన్నారు. అగ్రరాజ్యం ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని.. ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు బాగా పోరాడారని ప్రశంసించారు. రిపబ్లికన్ పార్టీకి 315 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.