
దేశ వ్యాప్తంగా రైల్వే ఛార్జీలు(Railway Fares) పెరిగాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు(Charges) అమలులోకి వచ్చాయి. రైలు ఛార్జీలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం(Central Govt) నిర్ణయించినట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే సోమవారం ఉదయం జులై ఒకటవ తేది నుంచి కొత్త ఛార్జీల(New Fares)ను అమలులోకి తీసుకురావాలని పేర్కొంటూ అన్ని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వే శాఖ సర్క్యులర్(Railway Department Circular) జారీ చేసింది. దీంతో అర్ధరాత్రి నుంచి పెంచిన ఛార్జీలను అమలులోకి వచ్చాయి.
తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి
ఈ ఉత్తర్వుల ప్రకారం ఆర్డనరీ స్లీపర్ క్లాస్(Ordinary Sleeper Class) టికెట్లపై కిలీమీటర్‌కు అరపైసా చొప్పున పెంచారు. Mail, ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీ రైళ్లలో స్లీపర్, సెకండ్‌క్లాసు,ఫస్ట్‌క్లాసు టిక్టెర్లపై కి.మీకు ఒక పైసా చొప్పున పెంచారు. అన్ని రకాల రైళ్లలో ఏసీ తరగతులకు కి.మీకు రెండు పైసలు పెంచారు. రిజర్వేషన్ ఛార్జ్(Reservation charge), సూపర్ పాస్ట్ ఛార్జీల్లో ఎటువంటి పెరుగుదల ఉండదని కేంద్రం పేర్కొంది. సబర్బన్ రైళ్లు, నెలవారీ సీజన్ టికెట్లలో కూడా ఎటువంటి మార్పులు చేయలేదని తెలిపింది. అలాగే రైళ్లలో తత్కాల్(Tatkal) బెర్తులను తీసుకునేందుకు ఆధార్(Aadhar) ధ్రువీకరణ తప్పనిసరి నిబంధన కూడా అమల్లోకి వచ్చింది.
పెరిగిన ఛార్జీలు ఎలా ఉన్నాయంటే..
☛ సాధారణ ద్వితీయ శ్రేణి (Ordinary Second Class)లో 500KM వరకు సాధారణ ఛార్జీలే ఉంటాయి. 501-1500KM వరకు టికెట్‌పై రూ.5, 1501KM నుంచి 2500KM వరకు టికెట్‌పై రూ.10, 2501KM – 3000KM వరకు రూ.15 చొప్పున పెంచారు.
☛ ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్లపై కి.మీ.కు అరపైసా చొప్పున పెంచారు.
☛ మెయిల్/ఎక్స్‌ప్రెస్ (Non AC) రైళ్లలో టికెట్లపై నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కి.మీ.కు ఒక పైసా చొప్పున పెంచారు.
☛ అన్ని రకాల రైళ్లలో.. ఏసీలో అన్ని తరగతులకు కి.మీ.కు 2 పైసలు చొప్పున పెంచారు.
☛ రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్, తేజస్, అమృత్‌భారత్ వంటి ప్రీమియర్ రైళ్లకూ కొత్త రుసుములు వర్తిస్తాయి.
☛ HYD నుంచి మడ్గావ్ లేదా వాస్కోడిగామకు రెండు వీక్లీ రైళ్లు నడుస్తుండగా వారానికి 3 వేల మంది వీటిలో ప్రయాణిస్తున్నారు. ఈ రైళ్లలోని ఏసీ క్లాస్‌లో ఒక్కొక్కరిపై సుమారు రూ.17 నుంచి రూ.18 అదనపు భారం పడనుంది.
☛ HYD- దిల్లీ (సుమారు 1700KM.): రూ.34 అదనం
☛ HYD- ముంబయి (సుమారు 700KM): రూ.14 అదనం
☛ HYD- అయోధ్య (సుమారు 1400KM): రూ.28 అదనం
🚆 Ministry of Railways has rationalised the basic fare of passenger train services to be effective from tomorrow.
The train fares will be increased marginally for non-AC Mail and Express trains by 1 paisa per km and for AC classes by 2 paisa per km.@RailMinIndia |… pic.twitter.com/xsXCIyLoE8
— All India Radio News (@airnewsalerts) June 30, 2025