భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు(High Tensions between India-Pakistan) నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం పడింది. రావల్పిండి క్రికెట్ స్టేడియం(Rawalpindi Cricket Stadium)లో గురువారం జరగాల్సిన పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్(Peshawar Zalmi vs Karachi Kings) మధ్య మ్యాచ్‌ను రద్దు చేశారు. భారత సాయుధ బలగాలు(Indian Armed Forces) పాకిస్థాన్(Pakistan)లోని రావల్పిండితో సహా పలు కీలక ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు(Air defense radars), వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో PSL మిగిలిన మ్యాచ్‌లను దోహా లేదా దుబాయ్(Dubai) వంటి విదేశీ వేదికలకు తరలించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.

విదేశీ ఆటగాళ్ల ఆందోళన
కాగా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా PSLలో ఆడుతున్న విదేశీ క్రికెటర్లు(Foreign Cricketers) తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. పీఎస్ఎల్ షెడ్యూల్(PSL Schedule) ప్రకారమే కొనసాగుతుందని PCB ప్రకటించినప్పటికీ, గురువారం ఉదయం భారత్ మరోసారి దాడులకు దిగడంతో పరిస్థితి మారింది. “రావల్పిండిలో జరగాల్సిన పీఎస్ఎల్ మ్యాచ్ డ్రోన్ దాడి(Drone Attack) కారణంగా రద్దయింది. విదేశీ ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు, వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని భావిస్తున్నారు” అని ఓ మాజీ పాక్ క్రికెటర్ తెలిపారు.








