ఇండియాలో రిచెస్ట్ ఎమ్మెల్యే ఆయనే

దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR​) నివేదిక విడుదల చేసింది. ఇందులో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్‌ షా (Parag Shah) నిలిచారు. ఆయన ముంబయిలోని ఘాట్కోపర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.3,400 కోట్లు.

రెండో స్థానంలో డీకే శివకుమార్

ఇక దేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shiva Kumar)  రూ.1413 కోట్ల విలువైన ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. అత్యంత పేద ఎమ్మెల్యేగా బంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్‌ కుమార్‌ ధారా (Nirmal Kumar Dhara) చివరి స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.1700 మాత్రమే.

Parag Shah

24 మంది వివరాలు పరిశీలించలేకపోయాం

ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్‌ (ADR Report 2025) తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 4,092 ఎమ్మెల్యేల వివరాలను విశ్లేషించింది. ఆర్థిక వివరాలు, కేసులు వంటి అంశాలను విశ్లేషించి రిపోర్టు రెడీ చేసింది. అయితే  దస్త్రాలు సరిగ్గా స్కాన్‌ చేయకపోవడం వల్ల 24 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించలేకపోయినట్లు ఏడీఆర్‌ తెలిపింది.

చంద్రబాబు, జగన్ కూడా రిచ్

పరాగ్ షా, డీకే శివకుమార్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కూడా ధనవంతులేనని ఏడీఆర్ రిపోర్టు పేర్కొంది. ఆయన ఆస్తుల విలువ మొత్తం రూ.931 కోట్లు ఉందని తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) రూ.757 కోట్ల ఆస్తులతో ధనవంతుల ఎమ్మెల్యే జాబితాలో నిలిచారని వెల్లడించింది. ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే పి.నారాయణ ఆస్తుల విలువ రూ.824 కోట్లు ఉందని వివరించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *